Share News

TS Politics: అనుకన్నట్టుగానే రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు హరీష్.. ఉత్కంఠ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:31 AM

Telangana: రైతు రుణమాఫీ అంశం ముఖ్యమంత్రికి, మాజీ మంత్రి మధ్య పెను తుఫానునే సృష్టిస్తోంది. రుణమాఫీ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అంటూ హరీష్‌ సవాల్‌ విసరడం.. అయితే రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగు అని సీఎం రేవంత్ రెడ్డి అనడం..

TS Politics: అనుకన్నట్టుగానే రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు హరీష్.. ఉత్కంఠ
Harish Rao At Gunpark

హైదరాబాద్, ఏప్రిల్ 26: రైతు రుణమాఫీ అంశం ముఖ్యమంత్రికి, మాజీ మంత్రికి మధ్య పెను తుఫానునే సృష్టిస్తోంది. రుణమాఫీ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అంటూ హరీష్‌ (Former Minister Harish Rao) సవాల్‌ విసరడం.. అయితే రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగు అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనడం.. గన్‌పార్క్ వద్ద లేఖతో సిద్ధమంటూ హరీష్ మరో సవాల్ విసరడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

YSR - YS Jagan: ‘వైఎస్‌ఆర్‌’ను ముంచిన జగన్‌


రాజీనామా లేఖతో...

అయితే... అనుకన్నట్లుగానే మాజీ మంత్రి హరీష్‌ రావు రాజీనామా లేఖతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్దకు శుక్రవారం ఉదయం చేరుకున్నారు. రాజీనామా లేఖను అమరవీరుల స్థూపం ముందు ఉంచారు. హరీష్‌రావుకు మద్దతు తెలుపుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి గన్‌పార్క్‌కుచేరుకున్నారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి హరీష్‌, బీఆర్‌ఎస్ నేతలు నివాళులర్పించారు.

Pawan Kalyan: ఒక్కరు కాదు.. ముగ్గురు పవన్‌లు.. పేర్లతో పరేషాన్‌!



దేవుళ్ల మీద ఒట్టు నిజమైతే....

ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ‘‘మీరిచ్చే హామీ నిజమైతే రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రావాలి. ఇద్దరి రాజీనామాను పెద్ద మనిషికి ఇద్దాం. రాజీనామాకు ఎందుకు ముందుకు రావడం లేదు. దేవుళ్ల మీద మీరేసే ఒట్టు నిజమైతే రాజీనామాకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు. నా పదవికంటే ప్రజల మేలే నాకు ప్రాధాన్యం. స్పీకర్ ఫార్మాట్‌లో నేను రాజీనామా లేఖతో వచ్చాను. నీకు ఇక్కడకు రావడం కుదరకపోతే మీ మనుషులతో పంపించండి. డిసెంబర్ 9న హామీలు అమలు చేయనందుకు రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా మాటకు కట్టుబడి ఆగస్టు 15న రైతు రుణమాఫీ, 6 గ్యారంటీలను అమలు చేయాలి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్ చేశారు. కాగా.. హరీష్ రావు రాక తెలుసుకొని గన్‌పార్కు వద్దకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి లేదంటూ వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు వెనక్కి పంపించివేస్తున్నారు.


నిజయితీ ఉంటే సవాల్ స్వీకరించాలి: తలసాని

సీఎం రేవంత్‌కు నిజాయితీ ఉంటే హరీష్ రావు సవాళ్లు స్వీకరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరీష్‌కు మద్దతుగా గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్న తలసాని మీడియాతో మాట్లాడుతూ.. దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పేది నిజమే అయితే రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు ఆగస్టు 15లోపు అమలు చేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి దేవుళ్ల మీద ఓట్ల పేరుతో కొత్త డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9 వరకే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని.. అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో తాము నిరసన తెలుపుతున్నామని తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు.

Puzzle: మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను కనిపెట్టండి!


సవాళ్లు.. ప్రతిసవాళ్లు...

కాగా.. రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు సవాళ్లు, ప్రతిసవాళ్లతో చేసుకున్నారు. ఆగష్టు 15 లోగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని.. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే సీఎం పదవకి రాజీనామాకు సిద్ధమా అంటూ హరీష్‌రావు సవాల్ విసిరారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరగాలంటూ సీఎం రేవంత్ కౌంటర్ విసిరారు. అయితే ఈ విషయంపై గన్‌పార్క్‌ వద్ద తేల్చుకుందామంటూ హరీష్‌ మరో సవాల్ విసిరారు. రాజీనామా లేఖతో గన్‌పార్క్‌ వద్దకు రావాలని, తాను కూడా రాజీనామా లేఖను తీసుకువస్తానని హరీష్‌ రావు తెలిపారు. ఈ క్రమంలో కాసేపటి క్రితమే మాజీ మంత్రి గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


ఇవి కూడా చదవండి...

AP Elections: మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం

YS Jagan: పథకాలు పీకేసి.. దళితులకు దగా చేసి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 26 , 2024 | 11:54 AM