Hanumantha Rao: పార్లమెంట్‌లో బీసీ కులగణన బిల్లు పెట్టాలి
ABN , Publish Date - Aug 05 , 2024 | 07:39 PM
పార్లమెంట్‌లో బీసీ కుల గణన బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V Hanumantha Rao) డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో అనురాగ్ ఠాకూర్ దిగజారి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాట్లాడారని అన్నారు.
ఢిల్లీ: పార్లమెంట్‌లో బీసీ కుల గణన బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Hanumantha Rao) డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో అనురాగ్ ఠాకూర్ దిగజారి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాట్లాడారని అన్నారు.నిర్మల సీతారామన్ బీసీ ప్రధానమంత్రి అయ్యారని చెబుతున్నారన్నారు. పదేళ్లలో ఓబీసీ ఎంపీలం కలిసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని గతంలో ప్రధానమంత్రిని కలిశామని కానీ ఇప్పటి వరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదని మండిపడ్డారు. ఎస్సీ , ఎస్టీ ఓబీసీల్లో ఒక ఆలోచన వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ ఒక ఆశగా ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నారన్నారు. ఈసారి కులగణన జరగాలంటే రాహుల్ గాంధీ రావాలని అందరు కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలో బీసీ కుల గణనకు రూ. 150 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే కులగణన సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్‌లో నిధులు కేటాయించారని చెప్పారు. కుల గణన చేపడుతామని అన్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులగణనపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీకి బీసీ నాయకత్వం మాత్రం కావాలన్నారు. బీజేపీ కులగణన అంశంలో వెనుకకు ఎందుకు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రధాని మోదీ కుల గణన చేస్తాడని అనుకోవడం లేదన్నారు. బీసీలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్‌లో ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీలో కుల గణన చేయాలని హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.