Home » Hanumantha Rao
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు(Former MP V. Hanumantha Rao) అన్నారు.
కాంగ్రెస్ మాజీ రాజ్యసభ ఎంపీ వి. హనుమంతరావు జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది. హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు నిరంతరం యువకులకు స్ఫూర్తిని ఇస్తాయని ఖర్గే, రాహుల్ గాంధీ ప్రశంసించారు.
తెలంగాణ (Telangana)లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantha Rao) తెలిపారు.
హరీష్‌రావుకు అంతరాత్మ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో ఆలోచన చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు.
దేశ స్వాతంత్య్ర పోరాటంలో, హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, దేశ చరిత్రనే బీజేపీ తారుమారు చేసే స్థితిలో ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రె స్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది..కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. సకలజనుల రిపోర్ట్ ఎక్కడకి పోయిందని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను నిలదీశారు.
ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.
పార్లమెంట్‌లో బీసీ కుల గణన బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V Hanumantha Rao) డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో అనురాగ్ ఠాకూర్ దిగజారి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాట్లాడారని అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఎమర్జెన్సీ కనిపించిన వాళ్లకి గోద్రా కనిపించలేదా? అని టీపీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు (Hanumantha Rao) ప్రశ్నించారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిందని కొనియాడారు.