Hanumantha Rao: హరీష్.. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించు: హనుమంతరావు
ABN , Publish Date - Oct 05 , 2024 | 02:02 PM
హరీష్‌రావుకు అంతరాత్మ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో ఆలోచన చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు.
హైదరాబాద్: పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. గాంధీభవన్‌లో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇవాళ( శనివారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ... హరీష్‌రావుకు అంతరాత్మ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో ఆలోచన చేయాలని హనుమంతరావు అన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే వారని తెలిపారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్ ఎత్తి వేయాలని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారని గుర్తుచేశారు. రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామన్నారని తెలిపారు. శరత్ పవార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఓబీసీ మాజీ జాతీయ కన్వీనర్‌గా శరత్ పవార్‌ను కలుస్తానని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాక అన్ని రాజకీయపార్టీల్లో చలనం వస్తుందని అన్నారు. కులగణన చేశాకనే లోకల్ బాడీ ఎన్నికలు పెడితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడే కులగణనకు సరైన సమయమని హనుమంతరావు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..
KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు
Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా
నా కుమారుల ఫామ్‌హౌ్‌సలు ఎక్కడున్నాయో చూపించాలి?
Read Latest Telangana News and National News