Share News

Harish Rao: రేవంత్ మాట మార్చాడు.. ఆ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయాలి

ABN , Publish Date - Nov 25 , 2024 | 06:47 PM

అదానీకి తెలంగాణలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రల మాటేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని ఎద్దేవా చేశారు.

Harish Rao: రేవంత్ మాట మార్చాడు.. ఆ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయాలి

సిద్దిపేట: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమి అదానీపై వివాదానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని తేల్చిచెప్పారు. అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు.. ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన.. రూ.100 కోట్లు స్వీకరించ కూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్బంగా రేవంత్ ప్రకటించారు. అయితే రేవంత్ ప్రకటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో ఓ పోస్ట్ చేశారు. ఆదానితో దావోస్‌లో చేసుకున్న రూ. 12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటి అని నిలదీశారు.


‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి.. మరి, రాహుల్ గాంధీ అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానితో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి. అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు అదాని అవినీతి బయటికు రాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల‌న్నింటినీ ర‌ద్దు చేయాలి’’అని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


ఆ విద్యార్థిని మృతికి రేవంత్ ప్రభుత్వమే కారణం

నిమ్స్‌లో వాంకిడి గురుకుల విద్యార్థిని మృతికి రేవంత్ ప్రభుత్వమే ముమ్మాటికీ కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. ‘‘రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ను వెంటాడుతాది. 25 రోజులుగా నువ్వు వెంటిలేటర్ మీద అనుభవించిన నరకానికి కాంగ్రెస్ ప్రభుత్వమే జవాబుదారీ. ఆ తల్లిదండ్రులకు సీఎం రేవంత్‌రెడ్డి గుండె కోతను మిగిల్చాడు.తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. విషాహారం వల్ల కన్నుమూయటం కలిచి వేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో బిడ్డను పట్టుకుని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ రేవంత్ సర్కారు పూర్తి వైఫల్యం చెందింది. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


ఆ నిధులను రద్దు చేస్తున్నారు..

సిద్దిపేట : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్పత్రులు మళ్లీ మొదటికి వస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పంపిణీ చేశారు. రేవంత్ ప్రభుత్వం ఏడాది అయినా మందులు , కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.రూ 27 కోట్లు క్యాన్సన్ కృతికల్ కేర్‌ను రద్దు చేసి, గాంధీకి తీసుకుపోయారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి పనులు ఏడాదిగా ఆపుతున్నారని ఫైర్ అయ్యారు.


రూ.200 కోట్ల రోడ్డు పనులు రద్దు చేసి, మంత్రి సీతక్క ములుగుకు తీసుకుపోతున్నారని ఆరోపించారు. సిద్దిపేటకు మంజూరైన నిధులను రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో గోదావరి జలాలతో కరువు లేకుండా చేశామని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో సిద్దిపేట అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మన అభివృద్ధిని చూసి, కల్లో నిప్పులు పోసుకున్నారని..నేడు నిధులకు మొకాలు అడ్డు పెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులకు డబుల్ పనులు చేసి, ప్రేమ పొందాలి కానీ రేవంత్ ప్రభుత్వం పేదల ఊసురు పోసుకుంటుందని అన్నారు. సిద్దిపేట అభివృద్ధి కోసం అసెంబ్లీలో కొట్లాడుతా..అవసరం అనుకుంటే కోర్టుకు కూడా వెళ్తానని హరీష్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

ఆ భేటీల మర్మమేమి...

అబద్ధాల్లో తగ్గేదేలే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 25 , 2024 | 06:50 PM