Share News

TG High Court: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు విచారణ

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:52 AM

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ఫై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

TG High Court: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇవాళ( సోమవారం) విచారణ చేయనుంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టనుంది. సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అసెంబ్లీ కార్యదర్శి. అప్పీల్‌లో పేర్కొన్నారు.


పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు పిటీషన్‌లో కోరారు. అప్పీల్‌పై ఈరోజు మరోసారి సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ తరఫున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.


ఈ తీర్పుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టికి బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది న్యాయస్థానం. మరి స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..

దానం నాగేందర్ - ఖైరతాబాద్

ప్రకాష్ గౌడ్ - రాజేంద్రనగర్

గూడెం మహిపాల్ రెడ్డి - పటాన్ చెరు

కాలె యాదయ్య - చేవెళ్ల

అరికెపూడి గాంధీ - శేరిలింగంపల్లి

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి - గద్వాల్

ఎం సంజయ్ కుమార్ - జగిత్యాల

పోచారం శ్రీనివాస్ రెడ్డి - బాన్సువాడ

తెల్లం వెంకట్రావు - భద్రాచలం

కడియం శ్రీహరి - స్టేషన్ ఘన్‌పూర్


ఈ వార్తలు కూడా చదవండి:

Tiger: ఆ మూడు జిల్లాల ప్రజలను వణికిస్తున్న పెద్దపులి..

Ponnam Prabhakar: కేటీఆర్‌కు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 11:52 AM