Group 1 Mains Exams : గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్షల కోసం కీలక మార్గదర్శకాలు
ABN , Publish Date - Oct 20 , 2024 | 05:14 PM
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) రేపటి(అక్టోబర్ 21) నుంచి గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు
హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) రేపటి(అక్టోబర్ 21) నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.ఈనెల 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఇప్పటికే 90శాతం మంది అభ్యర్థులు తుది పరీక్షల కోసం హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అన్ని కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.
పోలీస్ కమిషనర్లతో ప్రభుత్వం తగిన బందోబస్తు ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా పరీక్షల నిర్వహణ నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరగనున్నాయి. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సీసీలను పోలీసులు పర్యవేక్షిస్తారు.
పరీక్షల నిర్వహణలో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట సమయాన్ని అదనంగా కేటాయించారు. స్క్రైబ్‌ల సహాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నిపరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా అందించేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Tummala: రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారు... మంత్రి తుమ్మల ధ్వజం
ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..
Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..
HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
For Telangana News And Telugu News...