Share News

Jupalli Krishna Rao: టూరిజం డెవలప్ మెంట్‌తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి

ABN , Publish Date - Aug 20 , 2024 | 01:46 PM

పర్యాటక రంగ అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచలో మంత్రి పర్యటించారు.

Jupalli Krishna Rao: టూరిజం డెవలప్ మెంట్‌తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి
Jupalli Krishna Rao

జయశంకర్ భూపాలపల్లి: పర్యాటక రంగ అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచలో మంత్రి పర్యటించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. లక్మీనృసింహాస్వామిని మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు దర్శించుకున్నారు.


పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... వరంగల్‌లో పర్యాటక ప్రాంతాల్లో వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు. రాష్ట్రంలో టూరిజం డెవలప్ మెంట్ వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. రామప్ప టెంపుల్ అభివృద్ధికి కావాల్సిన చర్యలు చేపడతామన్నారు. కొడవటంచ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వసతి ఏర్పాట్లు కల్పిస్తామని మాటిచ్చారు.


సాంస్కృతిక, కళా, వారసత్వ సంపద మనకు వరమని వివరించారు. అపారమైన అడవులు, చారిత్రక ఆలయాలు, కోటలు ఇక్కడ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఆహ్లాదం కోసం ప్రతినెల పర్యటన చేయాలని అన్నారు. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ఆలయం రామప్ప అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 01:46 PM