KTR: రేవంత్‌ను వదలం.. కేటీఆర్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Nov 14 , 2024 | 05:49 PM
బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ప్రభుత్వం బోగస్ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. లగచర్ల బాధితులను బాధితులను ఢిల్లీకి తీసుకెళ్తామని... నేషనల్ హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేయిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(గురువారం)మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్‌కు లగచర్ల భూసేకరణ గిరిజన కుటుంబాలు చేరుకున్నాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉంటానని కేటీఆర్ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి సీట్ కోసం మంత్రులు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు.
ALSO READ: Minister Ponguleti :బీఆర్ఎస్ నేతలు అలా చేస్తే తీవ్ర పరిణామాలు.. మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్
నల్గొండ ,ఖమ్మం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క సీఎం చైర్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ముందుగా తన సీట్ పోకుండా రేవంత్ రెడ్డి చూసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భూముల ధరలు పెరిగాయని అన్నారు. ఏమైనా అభివృద్ధి చేస్తారేమోనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూముల ధరలు తగ్గాయని చెప్పారు. కాంగ్రెస్ మిగతా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. లగచర్లలో ఉంది ఫార్మా భూమి అని హైకోర్టు కోర్ట్‌కు సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. బయటకు వచ్చి ఫోర్త్ సిటీ అంటున్నారని కేటీఆర్ విమర్శించారు.
ALSO READ: HYDRA: ‘హైడ్రా’ రూటు మారింది.. కూల్చివేతలకు తాత్కాలిక విరామం
పోలీసులు ఘోరంగా ప్రవర్తిస్తున్నారు
‘‘లగుచర్ల ఇష్యూతో సర్కారు బంగపడింది. లగచర్లలో అరెస్టు అయిన వారిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి పెట్టి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు . పోలీసులు ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మా నాయకుడు సురేష్ తప్పేం చేశారు. నరేందర్ రెడ్డినీ ఎందుకు అరెస్టు చేశారు. నాలుగేళ్లలో మేమే అధికారంలోకి వస్తాం. ఆంధ్రలో ఏం జరిగిందో తెలంగాణలో అదే జరుగుతది. బీఆర్ఎస్ నేతలపై బోగస్ కేసులు పెడుతున్నారు. అధికారులకు అంత స్వామి భక్తి పనికి రాదు. రేవంత్ పిచ్చోడు.. అసలు వదలం. బాధితులను ఢిల్లీకి తీసుకెళ్తాం. నేషనల్ హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేస్తాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..
BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News and TELUGU NEWS