Share News

Minister Uttam: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా కోరాం

ABN , Publish Date - Jan 04 , 2024 | 09:00 PM

కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ ( Gajendra Singh Shekawat ) తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) ఢిల్లీలో గురువారం నాడు భేటీ అయ్యారు ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ( Palamuru-Ranga Reddy Project ) కు జాతీయహోదా కోరామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

Minister Uttam: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా కోరాం

ఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ ( Gajendra Singh Shekawat ) తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) ఢిల్లీలో గురువారం నాడు భేటీ అయ్యారు ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ( Palamuru-Ranga Reddy Project ) కు జాతీయహోదా కోరామని చెప్పారు. 90 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. 1200 గ్రామాలకు మంచినీళ్లు, 12లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని తెలిపారు. జాతీయహోదా ఇస్తూ 60శాతం వ్యయం కేంద్రం భరించాలని కోరామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

UPPSC తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించేలా చర్యలు...

సుదీర్ఘచర్చల తర్వాత ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు.. జాతీయహోదా ఇవ్వడం లేదని కేంద్రమంత్రి చెప్పారు. వేరే స్కీముల కింద 60శాతం ఫండింగ్ ఇస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 40 శాతం ఖర్చు చేసింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. UPPSC చైర్మన్‌ను రేపు ఉదయం 11 గంటలకు కలుస్తామని చెప్పారు. యూనియన్ పబ్లిక్ కమిషన్ తరహాలో పనిచేసేలా టీఎస్పీఎస్సీ( TSPSC )ని రూపొందించేలా చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 09:00 PM