Share News

Gangula Kamalakar: ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోంది

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:53 PM

ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులు కూడా కాంగ్రెస్ నేతలే పంచుతున్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gangula Kamalakar: ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం  కాలరాస్తోంది

హైదరాబాద్: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్‌ కోసం నామినేషన్ వేయలేదని.. ఆయనను ఎలా చైర్మన్‌‌గా నియమిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ప్రశ్నించారు. హరీష్ రావు‌ను ఎందుకు లిస్ట్‌లో లేకుండా చేశారని నిలదీశారు. హరీష్ రావు అంటే అధికార పార్టీకి భయమా అని అడిగారు. ఇవాళ( శనివారం) అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌‌కు ఇచ్చామని గుర్తుచేశారు.


ALSO Read: Prashanth Reddy: పీఏసీ నియామకంలో కూడా రాజకీయాలా..

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చాలా కీలకమని చెప్పారు. తాము అన్ని గమనిస్తామన్నారు. ఈ విషయంపై తెలంగాణ హై కోర్టును కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ స్పీకర్‌ను కలుద్దామని చూస్తే ఆయన వెళ్లిపోయారని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు కూడా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు.


ALSO Read:KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఫ్రొటోకాల్ పాటించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శలు చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులు కూడా కాంగ్రెస్ నేతలే పంచుతున్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Prashanth Reddy: పీఏసీ నియామకంలో కూడా రాజకీయాలా..

KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..=

Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 21 , 2024 | 05:30 PM