MLA Kaushik Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాస్ వార్నింగ్
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:17 PM
మాజీ మంత్రి కేటీఆర్‌ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల రైతులకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
కరీంనగర్: సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ విషయంలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలులో నిన్న రాత్రంతా ఉంచి ఈరోజు ఉదయం విడుదల చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ నటులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ను పలువురు ఖండించారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఖండించారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాల్సిన అంత అవసరం ఏంటని.. ఆయన చేసిన తప్పేంటని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
హుజురాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇవాళ(శనివారం)మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్యా ధియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని కాదు.. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని అన్నారు. కోర్ట్ బెయిల్ ఆర్డర్ ఇచ్చాక నిన్న రాత్రి జైలులో అల్లు అర్జున్‌ని ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల రైతులకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బేడీలు వేసి పశువులను తీసుకెళ్లినట్లు రైతును హాస్పిటల్‌కి తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. టెస్లా కంపెనీని హైదరాబాద్‌కి తీసుకురావాలనే కేటీఆర్ ఫార్ములా రేస్ తెచ్చారని గుర్తుచేశారు. దానిని రద్దు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని అన్నారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ వారిని తెలంగాణలో తిరుగనివ్వమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట: కేటీఆర్
అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని విమర్శిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. కానీ, ఆ రోజు జరిగిన ఘటనలో నిజంగా తప్పు ఎవరిది? అని కేటీఆర్ ప్రశ్నించారు. నేరుగా బాధ్యుడు కాని అర్జున్‌ను సాధారణ నేరగాడిలా పరిగణించడం సరికాదన్నారు. హైడ్రా భయంతో హైదరాబాద్‌లో ఇద్దరి మరణానికి కారణమైన సీఎం రేవంత్‌ను కూడా ఇలాగే అరెస్ట్ చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
Hyderabad: సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..
For Telangana News And Telugu News