Etela: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు...
ABN , Publish Date - Jul 16 , 2024 | 04:35 PM
Telangana: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఒట్టులు వేసి.. దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు.
హైదరాబాద్, జూలై 16: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఒట్టులు వేసి.. దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు. రుణమాఫీ నియమనిబంధనలు రైతులకు ఉరి తాళ్ళుగా మారతాయన్నారు. రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మోసం చేయాలని చూస్తారని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తుచేశారు.
CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
ప్రజల ఆలోచన పట్ల రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ.. అవమానాన్ని భరించరన్నారు. మోసగాళ్ళను, మాట ఇచ్చిన తప్పినవారిని అంతిమంగా ప్రజలు బొంద పెడతారని హెచ్చరించారు. అతి తక్కువ కాలంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి అని ఎంపీ విరుచుకుపడ్డారు. మరోసారి మోసగించబడ్డామని అన్ని వర్గాల ప్రజలు అంటున్నారన్నారు. ఐదేళ్ళు అధికారం ఇచ్చారని... ఇష్టం వచ్చినట్లు చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారన్నారు. గతంలో విమర్శలు చేసిన రేవంత్.. ఏడు నెలల నుంచి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చిత్తు కాగితంతో సమానమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ఉన్న ద్యాస.. ప్రజా సమస్యలపై లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే దమ్ము లేదని.. పేదల ఇళ్ళు కూలగొట్టటమే పనిగా రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకుందని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
CM Chandrababu: జోక్యం చేసుకోవద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Read Latest Telangana News And Telugu News