Share News

BRS: బీఆర్ఎస్ నేతపై కేసు నమోదు.. కారణమిదే..?

ABN , Publish Date - Nov 21 , 2024 | 09:17 AM

కాాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. భూములును ఆక్రమించిన వారిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టింది.

BRS: బీఆర్ఎస్ నేతపై కేసు నమోదు.. కారణమిదే..?

వరంగల్ : బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. భూ కబ్జా వివాదంలో శంకర్ నాయక్‌ ఇరుక్కున్నారు. ఆయనపై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఇవాళ(గురువారం) కేసు నమోదైంది. నగరంలోని హంటర్ రోడ్డు వినాయక నగర్ రోడ్డు1 దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని ఆక్రమణకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థల యజమానులకు చెందిన కంటైనర్‌తో పాటు గృహపకరణ వస్తువులను దొంగలించిన విషయంలో శంకర్ నాయక్‌పై పలు సెక్షన్‌లలో కేసు నమోదైంది. బాధితులపై దాడి చేసి, సెల్ ఫోన్లు లాక్కున్నారని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై ఆరోపణలు వచ్చాయి. వీటిపై పోలీసులు దృష్టి సారించారు. బాధితులు వరుసగా ఫిర్యాదు చేస్తుండటంతో పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు వేడుకుంటున్నారు.


కాగా గతంలో శంకర్ నాయక్‌పై2017లో మహబూబాబాద్‌లో కేసు నమోదైంది. అప్పటి కలెక్టర్ ప్రీతిమీనాతో అనుచితంగా ప్రవర్తించారన్న కేసును కోర్టు కొట్టివేసింది. శంకర్‌నాయక్‌పై అభియోగాలు రుజువు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వీగిపోయింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫోన్ ట్యాపింగ్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో భూ కబ్జా వివాదంలో మరో బీఆర్ఎస్ నేత చిక్కుకోవడంతో రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.


మరో వైపు గురువారం మహబూబాబాద్ వేదికగా జరగనున్న ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొంటారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే లగచర్ల ఘటనను సీరియస్‌గా తీసుకుంది. జాతీయస్థాయిలో లగచర్ల ఘటనను కేటీఆర్ ఎండగట్టారు. ఈ వివాదంపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈరోజు మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించడానికి ప్లాన్ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐటీకి మరింత ఊతం: సీఎం చంద్రబాబు

జనంలోకి మనం..

మరో పదేళ్లు చంద్రబాబే సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 21 , 2024 | 09:57 AM