Ravindra Naik: ఆదివాసీల డబ్బులను కేసీఆర్ పక్కదారి మళ్లించారు
ABN , Publish Date - Aug 09 , 2024 | 09:31 PM
ఆదివాసీలకు సంబంధించిన రూ.700 కోట్లను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దారి మళ్లించారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఆదివాసీలకు ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం చేసింది వ్యర్థమని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీ: ఆదివాసీలకు సంబంధించిన రూ.700 కోట్లను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దారి మళ్లించారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఆదివాసీలకు ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం చేసింది వ్యర్థమని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఏడున్నర శాతం ఉన్న గిరిజనులు 12 శాతం పెరిగినా రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు వారికి అందనంత వరకు వారికి మేలు జరగదని చెప్పారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసి పార్లమెంట్ ప్రారంభానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.
అవుట్ సోర్స్ ద్వారా బాక్ లాక్ వేకెన్సీ పట్టించుకోవడం మానేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల విశ్వాసం పొందాలంటే వారి హక్కులు వారికి కావల్సినవి కేంద్రప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. చెంచుల జన సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించేలా గవర్నర్ల నుంచి కేంద్రం నివేదిక కోరాలని అన్నారు. ఆదివాసీల అంశం కేంద్రం అంశమని చెప్పారు. ఆదివాసీల డబ్బు ఇతర అంశాలపై ఖర్చు చేస్తున్నారని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు.