Rammohan Reddy: కమిటీల ఏర్పాటుపై హరీష్‌రావు మాటలు విడ్డూరంగా ఉన్నాయి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే విసుర్లు
ABN , Publish Date - Sep 09 , 2024 | 07:03 PM
పీఏసీ చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ స్పీకర్ నియమించారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హరీష్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు చేశారు.
హైదరాబాద్: శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఈరోజు(సోమవారం) ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. హరీష్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు హరీష్‌రావు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు చేశారు. ఈరోజు(సోమవారం) ప్రజాభవన్‌లో రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... గతంలో బీఆర్ఎస్ చేసిన ఫిరాయింపులను గుర్తు చేసుకుంటే మంచిదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.
ALSO READ:TG News: 4కోట్ల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠా అరెస్ట్
పార్టీ ఫిరాయింపులు, కమిటీల ఏర్పాటు అంశంపై బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కే లేదని అన్నారు. 16వ ఆర్థిక సంఘం ముందు తమ ప్రభుత్వ ఆలోచనలు ఉంచామని వివరించారు. బీజేపీ పాలిత ప్రాంతాలకు అధిక నిధులు ఇస్తున్నారని చెప్పారు. బీజేపీ నిధుల విడుదల అంశాలపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు గత ఏడాది రావాల్సిన రూ. 10 వేల కోట్లలో రూ. 6 వేల కోట్లు కోత విధించారని ఆరోపించారు. పనుల్లో 42 శాతం ఇస్తామని 30 శాతం మాత్రమే ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారని గుర్తుచేశారు. ఉపాధి హామీ కూలీలు కష్టాలు పడుతున్నారని చెప్పారు. విపత్తు సమయంలో ఆర్థిక సహాయం కేంద్రం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన సహాయం సరైన సమయానికి రావడం లేదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
ALSO READ:CM Revanth Reddy: ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని హామీ ఇచ్చారు. ఎన్‌హెచ్ఎం కింద తెలంగాణకు నిధులు తక్కువ వస్తున్నాయని చెప్పారు. పర్ఫార్మెన్స్ బాగున్నా రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు. నిధుల విడుదలలో నేషనల్ ఫైనాన్స్ కమిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ సభ్యులను బాగస్వాములు చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి
Mahesh kumar: ప్రతీ హామీ అమలు చేసి తీరతాం
Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..
Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు
BRS MLA'S: హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హర్షం
Read Latest Telangana News AndTelugu News