Mallareddy: బీజేపీ ఆఫీసుకు మల్లారెడ్డి.. ఎందుకు వెళ్లారంటే..
ABN , Publish Date - Oct 10 , 2024 | 04:14 PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. మరి మల్లారెడ్డి బీజేపీ ఆఫీసుకు ఎందుకెళ్లారు? ఏం పని మీద వెళ్లారు?
హైదరాబాద్, అక్టోబర్ 10: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. మరి మల్లారెడ్డి బీజేపీ ఆఫీసుకు ఎందుకెళ్లారు? ఏం పని మీద వెళ్లారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ ఆఫీసులోనే ఎందుకు కలిశారు? అసలేం జరుగుతోంది? ఇవన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వార్త మొత్తం చదవాల్సిందే.
ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ఇప్పుడు బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తన మనుమరాలు వివాహానికి రావాల్సిందిగా కిషన్ రెడ్డిని ఆహ్వానించేందుకు ఆయన పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీసులో అందుబాటులో ఉండటంతో.. మల్లారెడ్డి నేరుగా పార్టీ ఆఫీసుకు వచ్చారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కిషన్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తన మనుమరాలు పెళ్లికి రావాల్సిందిగా ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మల్లారెడ్డి కోరారు.
ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మల్లారెడ్డి.. ఆ తరువాత రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ వరుస భేటీలతో ఏదో జరుగుతోందని అంతా అనుకున్నారు. ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ భేటీలు మరింత ఉత్కంఠ రేపాయి. అయితే, ఈ ప్రచారంపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని.. తన మనుమరాలు పెళ్లి ఉందని, పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేసినట్లు మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Also Read:
పెళ్లిలో లోబడ్జెట్ డీజే.. వీళ్ల ఐడియా చూస్తే..
జైలు జీవితంపై జగన్ షాకింగ్ కామెంట్స్
For More Telangana News and Telugu News..