Share News

Uttam Kumar Reddy: ధాన్యం బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 23 , 2024 | 07:05 PM

అన్నదాతకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సన్నాల వడ్లకు బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.

Uttam Kumar Reddy: ధాన్యం బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక  ప్రకటన
Uttam Kumar Reddy

హైదరాబాద్; తెలంగాణలో ఖరీఫ్ నుంచి సన్నాల వడ్లకు రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని.. ఈ నిర్ణయం విప్లవాత్మకమైనదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఖరీఫ్ పంట కొనుగోలుపై జాయింట్ కలెక్టర్‌లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖా మేనేజర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ(సోమవారం) ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఖరీఫ్‌లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో ధాన్యాన్ని రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. 146 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. 91 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అంచనా వేసిందని అన్నారు.


ALSO READ: Mahesh Babu: వరద బాధితులకు సూపర్ స్టార్ మహేశ్ విరాళం.. సీఎంను కలిసి.

మొట్టమొదటిసారిగా 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోడౌన్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రల నుంచి వచ్చే ధాన్యంపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆశించిన మేరకు సన్నాల దిగుబడి చేస్తున్నారని అన్నారు. 36 లక్షల 80 వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేస్తున్నారని వివరించారు. 88 లక్షల 9 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేశామన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.


ALSO READ: Beerla Ilaiah: హరీష్‌, కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్ ఫైర్

ధాన్యం కొనుగోలులో అధికారులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అన్నీ ఏర్పాటు చేస్తామని వివరించారు. రైతులు సున్నిత మనస్కులు అని తెలిపారు. వారి మనస్తత్వన్నీ బట్టి అధికారులు నడుచుకోవాలని సూచించారు. ఖరీఫ్‌లో సేకరించిన సన్నాలతో జనవరి నుంచి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. మూడు కోట్ల మంది లబ్ధిదారులకు గానూ ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Harish: బీహార్‌‌లా తెలంగాణను మారుస్తున్నారు.. హరీష్ ఆగ్రహం

KTR: బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

Beerla Ilaiah: హరీష్‌, కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్ ఫైర్

Read latest Telangana News And Telugu News


Updated Date - Sep 23 , 2024 | 07:14 PM