Vasudeva Reddy: గురుకుల ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు
ABN , Publish Date - Jul 01 , 2024 | 03:21 PM
గురుకుల ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ సీనియర్ నేత వాసుదేవరెడ్డి (Vasudeva Reddy) సంచలన ఆరోపణలు చేశారు. రిజర్వేషన్‌లలో గందరగోళం జరిగిందని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని అన్నారు.
హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ సీనియర్ నేత వాసుదేవరెడ్డి (Vasudeva Reddy) సంచలన ఆరోపణలు చేశారు. రిజర్వేషన్‌లలో గందరగోళం జరిగిందని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తే..రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
నియామక పత్రాలు వచ్చినవారు జాయినింగ్ కోసం వెళ్తే ఉద్యోగం లేదని అంటున్నారని చెప్పారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకం చేయాలని నిబంధనలు ఉన్నాయని.. కానీ స్వయంగా సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో తిరస్కరిస్తున్నారని.. అలా 36మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్లో తిరస్కరించారని చెప్పారు. ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డవారు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వాసుదేవరెడ్డి కోరారు.