Kaleshwaram: ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ని విచారిస్తాం.. జస్టిస్ చంద్ర ఘోష్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:47 PM
కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై విచారించడానికి జస్టిస్ చంద్ర గోష్ (Justice Chandra Ghosh) కమిషన్‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన విషయం తెలిసిందే. నేటి(గురువారం) నుంచి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను దృష్టిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై విచారించడానికి జస్టిస్ చంద్ర గోష్ (Justice Chandra Ghosh) కమిషన్‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన విషయం తెలిసిందే. నేటి(గురువారం) నుంచి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను దృష్టిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో జస్టిస్ చంద్ర ఘోష్ చిట్‌చాట్ చేశారు. మీడియాతో పలు కీలక విషయాలను పంచుకున్నారు. అవసరం అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను పిలిచి కాళేశ్వరం ప్రాజెక్టుపై తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తామని అన్నారు.
Minister Uttam: జస్టిస్ చంద్ర ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్
రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తామని తెలిపారు. విచారణలో నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్టులను కూడా దృష్టిలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లతో త్వరలోనే భేటీ అవుతామని.. ఎన్డీఎస్ఏ అథారిటీతో కూడా సమావేశం అవుతామని స్పష్టం చేశారు. టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తామన్నారు. తాను స్వతహాగా ఇంజనీర్‌ని కాదని.. తనకు అందరి సహాయ సహకారాలు అవసరమని వివరించారు. తాను ముఖాలను చూసి విచారణ చేయనని.. లీగల్ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.
CM Revanth: రిజర్వేషన్లు కావాలా?.. వద్దా? అనేదానికి ఈ ఎన్నికలే రెఫరెండం
ఈ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న అందరినీ కలుస్తామని.. తమకు కావాల్సిన సహాయ సహకారాలను తీసుకొని విచారణ చేస్తామన్నారు. లీగల్ సమస్యలు తలెత్తకుండా విచారణ కొనసాగిస్తామని.. ఏమైనా ఇబ్బంది అయితే స్టే వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. నిర్మాణ సంస్థలతో పాటు అవసరమైతే రాజకీయ నాయకులకు సైతం నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఇస్తామని స్పష్టం చేశారు. రెండో విడతలో భాగంగా మేడిగడ్డ గ్రౌండ్‌కు వెళ్లి బ్యారేజీలను పరిశీలిస్తామని వివరించారు. ఇప్పటికైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని.. చాలా విషయాలను తెలుసుకున్నామని అన్నారు. నివేదికల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని.. దాంతోపాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ చంద్ర గోష్ పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024:నామినేషన్ వేసిన అనంతరం రఘురామిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News