Share News

Graduate MLC Elections: ఆ విషయంలో ప్రతిపక్షం వైపు నిలబడాలి: కేటీఆర్

ABN , Publish Date - May 20 , 2024 | 03:49 PM

ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటే చైతన్య గడ్డ అయిన కొత్తగూడెం ప్రజలు ప్రతిపక్షం వైపు నిలబడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. .వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్‌లో సోమవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Graduate MLC Elections: ఆ విషయంలో ప్రతిపక్షం వైపు నిలబడాలి: కేటీఆర్
KTR

భద్రాద్రి కొత్తగూడెం: ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటే చైతన్య గడ్డ అయిన కొత్తగూడెం ప్రజలు ప్రతిపక్షం వైపు నిలబడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. .వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్‌లో సోమవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలను అప్రమత్తం చేశామని.. అయినా ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మోసపోయమని ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికలో గెలిచిన పార్టీలు నియంతృత్వ పోకడులకు అడ్డుకట్ట వేయడానికి రాజ్యసభ, శాసనమండలి వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రశ్నించేందుకే గ్రాడ్యుయేట్లు ప్రతిపక్ష అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. సమర్థ ప్రతిపక్షం కోసం ప్రశ్నించే బీఆర్ఎస్‌‌కు ప్రజలు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు. ఈ సమ్మేళనంలో కేటీఆర్‌, రాకేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 03:51 PM