Share News

TG Politics: డీజీపీ ఆదేశాలు ఇచ్చినా ఇలా చేస్తారా.. మెదక్ పోలీసులకు రఘునందన్‌రావు వార్నింగ్

ABN , Publish Date - Jun 16 , 2024 | 10:26 PM

మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గో సంరక్షకుడు అరుణ్ రాజు గాయపడ్డాడు. ఆయన మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతున్న అరుణ్ రాజును నేడు(ఆదివారం) మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) పరామర్శించారు.

TG Politics: డీజీపీ ఆదేశాలు ఇచ్చినా ఇలా చేస్తారా.. మెదక్ పోలీసులకు రఘునందన్‌రావు వార్నింగ్
MP Raghunandan Rao

హైదరాబాద్: మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గో సంరక్షకుడు అరుణ్ రాజు గాయపడ్డాడు. ఆయన మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతున్న అరుణ్ రాజును నేడు(ఆదివారం) మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) పరామర్శించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.... గోవులను తరలిస్తున్నారని తమ గో సంరక్షకులు పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.


చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువధపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా కీలక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అయినా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. నిన్నటి ఘటనపై పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గో సంరక్షకులపై దాడి జరిగితే ఇప్పటివరకు దాడి చేసిన నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. కానీ గోవధను అడ్డుకున్న హిందువులను అరెస్టు చేశారని మండిపడ్డారు. గో సంరక్షకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే జరిగే పరిణామాలకు మెదక్ ఎస్పీ బాధ్యత వహించాలని హెచ్చరించారు.


బక్రీద్ సందర్భంగా పశువులను తరలిస్తున్నారని సమాచారం ఇస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. గో సంరక్షకులపై ఇష్టం వచ్చినట్లుగా మెదక్ ఎస్ఐ, సీఐ మాట్లాడారని ధ్వజమెత్తారు. మెదక్ టౌన్‌లో 144 సెక్షన్ ఉందని డీజీ చెబుతున్నాడని అన్నారు. తాను ప్రజల చేత ఎన్నుకున్న ఎంపీని కచ్చితంగా మెదక్ వెళ్తానని స్పష్టం చేశారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. పోలీసులు భయపడితే తాను భయపడనని అన్నారు. ఈ రోజు ఉదయం ఐదుగురు, సాయంత్రం మరి కొంత మంది హిందువులనే మెదక్ పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ముస్లింలను అరెస్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

Updated Date - Jun 16 , 2024 | 10:26 PM