Share News

Kamareddy: కామారెడ్డిలో కీచక ఉపాధ్యాయుడు.. పట్టణంలో హైటెన్షన్..

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:50 PM

కామారెడ్డి జీవధాన్ హైస్కూల్లో ఓ విద్యార్థిని 8వ తరగతి చదవుతోంది. అయితే అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఓ కామాంధుడు.. బాలికపై కన్నేశాడు. రోజూ అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.

Kamareddy: కామారెడ్డిలో కీచక ఉపాధ్యాయుడు.. పట్టణంలో హైటెన్షన్..

కామారెడ్డి: జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కామారెడ్డి (Kamareddy) జీవధాన్ హైస్కూల్లో(Jeevadhan High School) విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి బాలికతో నీచంగా వ్యవహించాడు. ఈ దారుణాన్ని విద్యార్థిని ఇంట్లో చెప్పడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


కామారెడ్డి జీవధాన్ హైస్కూల్లో ఓ విద్యార్థిని 8వ తరగతి చదవుతోంది. అయితే అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఓ కామాంధుడు.. బాలికపై కన్నేశాడు. రోజూ అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. అయితే అతని ఆగడాలు పెచ్చుమీరి పోవడంతో బాలిక తట్టుకోలేక విషయం ఇంట్లో చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బంధువులతో కలిసి పాఠశాల వద్దకు భారీగా చేరుకున్నారు. తమ కుమార్తె పట్ల ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరుపై యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం ఆందోళనకు దిగారు. దీంతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కోరారు.


ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో నిరసనకారులు రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు రాయి తగిలి గాయమైంది. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయణ్ని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐపై దాడి జరగడం, ఆందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను చెదరకొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కామారెడ్డిలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..

Updated Date - Sep 24 , 2024 | 02:55 PM