Padi Kaushik Reddy: దానం నాగేందర్‌పై అనర్హతా వేటు వేయాలి
ABN , Publish Date - Mar 30 , 2024 | 07:10 PM
బీఆర్‌ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్ అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) కోరారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మార్చ్ 18వ తేదీన సభాపతిని కలిసి దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ వేసినట్లు తెలిపారు.
హైదరాబాద్: బీఆర్‌ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్ అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) కోరారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మార్చ్ 18వ తేదీన సభాపతిని కలిసి దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ వేసినట్లు తెలిపారు. దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి వెళ్లారని తాము ఫిర్యాదు చేసి12 రోజులైనా స్పీకర్ నుంచి స్పందన లేదన్నారు. అదనపు అఫిడవిట్ సమర్పించేందుకు సభాపతిని కలిసేందుకు వెళ్తే ఎవరూ లేరని చెప్పారు. కార్యదర్శిపై ఏం ఒత్తిళ్లు ఉన్నాయో... కానీ ఆయన కూడా అందుబాటులో లేరన్నారు. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును అధికారికంగా ఎలా ప్రకటించారని ప్రశ్నించారు.
TG Politics: కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని.. కీలక పదవి!
సభాపతి నిర్ణయం తీసుకొని దానం నాగేందర్‌పై అనర్హతా వేటు వేస్తే దేశం మొత్తం హర్షిస్తారని చెప్పారు. నాగేందర్‌పై చర్య తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారవుతారని అన్నారు. సభాపతి వెంటనే స్పందించాలని.. చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. నలుగురు ఎమ్మెల్యేలం పోతే కనీసం తమ వినతిపత్రం తీసుకోరా? అని ప్రశ్నించారు. సభాపతి చర్య తీసుకోకపోతే న్యాయస్థానానికి వెళ్తామని హెచ్చరించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం ఆ నేతలకు అంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదన్నారు. కడియం శ్రీహరి పార్టీ మారడం నమ్మించి గొంతు కోయడమేనని అన్నారు. ప్రజలు ఆయనను చీకొట్టే పరిస్థితికి వచ్చారని చెప్పారు.
Congress: కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్.. సోదరుడు కూడా
ఎవరూ కడియంలా మాత్రం చేయరన్నారు. ఆయన వరంగల్ వెళ్తే ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఉందన్నారు. పార్టీ నుంచి వెళ్లే నేతలకు రాబోయే కాలంలో అనర్హత వేటు వేస్తామని చెప్పారు. రైతులు లబోదిబోమని ఏడ్చే పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు(ఆదివారం) పరిశీలనకు వెళ్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
TG Politics: బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలుతుంది: మహేశ్వర రెడ్డి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి