Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...
ABN , Publish Date - Apr 15 , 2024 | 01:13 PM
Telangana: నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో అల్పాహారం చేసిన జీవన్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విరుచుకుపడ్డారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్ ఐదు సంవత్సరాలు గడిచినా బోర్డ్ తేలేదని విమర్శించారు.
నిజామాబాద్, ఏప్రిల్ 15: నిజామాబాద్‌లో (Nizamabad) పసుపు బోర్డుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి (Nizamabad Parliament Congress candidate Jeevan Reddy) స్పష్టం చేశారు. సోమవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో అల్పాహారం చేసిన జీవన్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై (BJP MP Dharmapuri Arvind) విరుచుకుపడ్డారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్ ఐదు సంవత్సరాలు గడిచినా బోర్డ్ తేలేదని విమర్శించారు. రుణమాఫీ, పసుపు బోర్డ్, చెక్కర కర్మాగారం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Former MLA Bajireddy Govardhan Reddy) నిజామాబాద్ రూరల్‌ను అభివృద్ధి చేయలేదని వ్యాఖ్యలు చేశారు.
Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి
నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్‌గా ఉండి మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన వెంటనే మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీడీ మహిళ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఫించన్లు అందిస్తామన్నారు. సారగపూర్ సహకార సంఘం చెక్కర పరిశ్రమ ప్రారంభిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
YS Jagan:రాయి దాడిపై తొలిసారి స్పందించిన జగన్.. కారణం అదేనట..
Andhrapradesh: అన్నింటిలోనూ అధమస్థానంలో ఏపీ.. ఆర్థికవేత్త చిన్నయసూరి వ్యాఖ్యలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...