CM Chandrababu: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఇలా ఉంటారా.. అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Jan 09 , 2025 | 10:56 AM
CM Chandrababu: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా తరలివస్తారని తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
తిరుపతి: తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి తోపులాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. వైకుంఠద్వార దర్శనానికి నిన్న ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. బైరాగిపట్టెడ టోకెన్ల జారీ కేంద్రం వద్ద భక్తుల మధ్య తోపులాట జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారు రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన 32 మందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న మిగతా 16 మంది క్షతగాత్రులను స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతి రానున్నారు. ఈ మేరకు12 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు సీఎం చంద్రబాబు వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ డీజీపీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా వస్తారని తెలిసీ.. ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి జిల్లా అధికారులు వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను సమీక్షించాలని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన
Minister Anagani: తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్
YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
Read Latest AP News and Telugu News