Alert for Tirumala Devotees: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..
ABN , Publish Date - Feb 24 , 2025 | 09:40 PM
Alert for Tirumala Devotees: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలని భావించే వారికి అలర్ట్. దర్శనానికి సంబంధించి టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసింది.

తిరుమల: వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి కాలంతో సంబంధం లేకుండా భక్తులు పోటెత్తుతారు. రోజుకు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. అందుకు నిదర్శనమే టీటీడీ విడుదల చేసిన ఆన్‌లైన్ టికెట్లు. ఇవాళ (సోమవారం) ఒక్కరోజే 4.8 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లు అన్నింటినీ స్వామివారి భక్తులు కొనుగోలు చేశారు. దీంతో టీటీడీ ఖజానాకు రూ.12.24 కోట్ల ఆదాయం సమకూరింది.
మే నెలకు సంబంధించిన అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల చేసిన రెండు నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేశారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లను సైతం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే భక్తులు పొందారు. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. రోజుకి 500 చొప్పున 15 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. శ్రీవాణి టిక్కెట్ల విక్రయాలు పూర్తయితే టీటీడీ ఖజానాకు రూ.15.75 కోట్ల ఆదాయం వచ్చి చేరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Sathya Prasad: ప్రతిపక్ష హోదా కోసం జగన్ వితండవాదం.. మంత్రి అనగాని సెటైర్లు
YS Sharmila: 11 మందితో వచ్చింది 11 నిమిషాల కోసమా.. జగన్‌పై షర్మిల ఆగ్రహం
Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్
Read Latest AP News And Telugu News