Share News

Purandeswari: 2047నాటికి మోదీ టార్గెట్ అదే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 23 , 2025 | 09:09 PM

Daggubati Purandeswari: చట్టసభల్లో సైతం మహిళల ప్రాతినిధ్యం పెంచేవిధంగా నిర్ణయం తీసుకున్న ఘనత మోదీకే దక్కుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. యువతకు, రైతులకు మేలు జరిగే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

Purandeswari: 2047నాటికి  మోదీ టార్గెట్ అదే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
Daggubati Purandeswari

రాజమండ్రి: మహిళలు, యువత, రైతులు, పెట్టుబడులు ప్రధాన అంశాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పన చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. 2047నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు. ఇవాళ(ఆదివారం) రాజమండ్రిలో పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడారు.


మోదీ లక్ష్యాలకు అణుగుణంగా 50లక్షల 60వేల కోట్ల రూపాయల పైచిలుకు కేంద్ర బడ్జెట్ ఉందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను గౌరవించడమే కాకుండా ఆయన ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీయేదని ఉద్ఘాటించారు. చట్టసభల్లో సైతం మహిళల ప్రాతినిధ్యం పెంచేవిధంగా నిర్ణయం తీసుకున్న ఘనత మోదీకే దక్కుతుందని చెప్పారు. యువతకు, రైతులకు మేలు జరిగే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Rammohan Naidu: ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర

YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు

YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 23 , 2025 | 09:09 PM

News Hub