Share News

CM Chandrababu: వారిపై కఠినంగా ఉండాలి.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:21 PM

CM Chandrababu: తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలను ఊపేక్షించవద్దని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

CM Chandrababu:  వారిపై కఠినంగా ఉండాలి.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu Naidu

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలంలో గల దూబచర్లగాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఖండించారు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో ఇవాళ(శనివారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష చేశారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు. భారతరత్న అంబేద్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


ఈ ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను సీఎం చంద్రబాబుకు డీజీపీ తెలిపారు. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎంకు డీజీపీ తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎంకు వివరించారు. వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా కుట్ర చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు కోరారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pawan Farm Pond Inauguration: ఆ విజయానికి కారణం చంద్రబాబే

CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..

Jagan Sharmila On Delimitation: పునర్విభజన‌పై జగన్, షర్మిల ఏమన్నారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 22 , 2025 | 05:03 PM