Share News

CM Chandrababu: ఐదేళ్లలో మేము ఇచ్చే ఉద్యోగాలు ఇవే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ABN , Publish Date - Jan 12 , 2025 | 10:48 AM

CM Chandrababu :ఏపీ పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: ఐదేళ్లలో  మేము ఇచ్చే ఉద్యోగాలు ఇవే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Chandrababu

అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దేశంలో తొలిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

atchannaidu-anger.jpg

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. రాష్ట్ర యువతకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. యువతే దేశ భవిష్యత్తు అన్న స్వామి వివేకానంద మాటలు నేడు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో సాకారం అవుతున్నాయని చెప్పారు. ఆత్మవిశ్వాసం, కర్తవ్య నిబద్ధత, పరోపకారం అనే పదాలకు నిలువెత్తు రూపం స్వామి వివేకానంద అని ప్రశంసించారు. కోట్లాది మంది యువతరానికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Mandipalli-Ramprasad-Reddy.jpg

యువతకు స్ఫూర్తి ప్రధాత, మార్గదర్శి, భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్ర యువతరానికి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.స్వామి వివేకానంద యువతను ఉద్భోదిస్తూ, సనాతన ధర్మ విలువలను తెలియజేశారని చెప్పారు. “స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరం” అని చెప్పారు. ఆంధ్రదేశ్‌ను యువతరానికి ఆశాజ్యోతిగా తీర్చిదిద్దుతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Sankranthi Kodi Pandalu:జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లు

Leopard Attacks : టీటీడీ ఉద్యోగిపై దాడికి యత్నించిన చిరుత

TDP Minister : మా వాళ్లే వదిలేయ్‌!

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 12 , 2025 | 11:18 AM