Share News

CM Chandrababu: ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:16 PM

CM Chandrabab: ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన.. మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతిని నెంబర్ వన్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu: ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం
CM Chandrababu

కడప జిల్లా: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించారు. మైదుకూరులో ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని.. తొలిసారి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన.. మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాలవారికి రాజ్యాధికారంలో.. భాగస్వామ్యం కల్పించిన సమతావాది. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం. తెలుగు జాతిని నెంబర్ వన్‌గా మారుస్తాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఎన్టీఆర్‌ అంటే తెలుగువారి ఆత్మగౌరవం...

‘‘ఎన్టీఆర్‌ అంటే తెలుగువారి ఆత్మగౌరవం. ఎన్టీఆర్‌ అంటే పేదవాడి గుండెల్లో తీపిజ్ఞాపకం. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు.. తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌. తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌. పాలకులు కూడా సేవకులను చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌. రాజకీయం అంటే పేదల జీవితాలు మార్చేదని చేసి చూపించారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ ఒక స్ఫూర్తి.. ఒక ఆదర్శం.. ఆయన జీవితం ఒక సందేశం. పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీఆర్‌ కల. పేదరికం లేని సమాజం టీడీపీతోనే సాధ్యం.. చేసి చూపిస్తాం. ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే కారణం ఎన్టీఆరే’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఎన్టీఆర్‌ను తెలుగుజాతీ ఎన్నటికీ మరువదు: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

Kumar-Raja-Varla.jpg

కృష్ణాజిల్లా (పామర్రు): తెలుగువారి మనసుల్లో ఎన్టీఆర్ చిరంజీవిగా నిలిచి ఉంటారని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. నిమ్మకూరులో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలతో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూటమినేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడారు. 29 ఏళ్లు గడిచిన ఎన్టీఆర్ స్మృతులు నేటికీ ప్రజల కల్లఎదుట మెదులుతున్నాయని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు.. ఎన్టీఆర్‌ను తెలుగుజాతీ ఎన్నటికీ మరువదని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ప్రజల మంచి కోసం పనిచేస్తున్నామని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

NTR Death Anniversary:ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు: నందమూరి బాలకృష్ణ

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

NTR Death Anniversary: తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్ : మంత్రి నారా లోకేష్

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 18 , 2025 | 03:06 PM