Minister Anitha: ఆ అధికారులపై హోంమంత్రి అనిత ప్రశంసలు
ABN , Publish Date - Feb 20 , 2025 | 06:17 PM
Minister Anitha: పోలీసు అధికారులపై హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. మీ సేవలు బాగున్నాయని కితాబు ఇచ్చారు. విద్యార్థునుల ఆచూకీ కనిపెట్టడంలో చాకచక్యంగా వ్యవహారించారని హోంమంత్రి అనిత ప్రశంసించారు.

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి పోలీసులపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) ప్రశంసల వర్షం కురిపించారు. కృష్ణ జిల్లా గన్నవరంలో ఐదుగురు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ విషయంపై సత్తెనపల్లి పోలీసులకు గన్నవరం పోలీసులు సమాచారం ఇచ్చారు. ట్రైన్‌లో విద్యార్థినులు వెళ్తున్నారని సమాచారంతో అర్థరాత్రి సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌కు సత్తెనపల్లి పోలీసులు వెళ్లారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కోణార్క్ ట్రైన్‌లో పిడుగు రాళ్ల దగ్గర విద్యార్థినులను సత్తెనపల్లి పోలీసులు పట్టుకున్నారు.
విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులకు ప్రశంసలు కురిపించారు. ప్రజా పోలీసింగ్ అంటే ఇలా ఉండాలని కితాబు ఇచ్చారు. డీఎస్పీ హనుమంతు రావు ,సీఐ బ్రహ్మ య్యకు ప్రత్యేకంగా ఫోన్ చేసి హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు.
అసలు ఏమైందంటే..
కాగా, కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ముస్తాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినులు విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే వీరంతా కాలేజీ హాస్టల్ నుంచి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. తమ స్నేహితులు కనిపించకపోవడంతో కళాశాల సిబ్బందికి తోటి విద్యార్థినులు సమాచారం అందించారు.
కాలేజీ అంతా వెతికినా విద్యార్థినుల ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీకి వెళ్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విద్యార్థినులు హైదరాబాద్ వైపు వెళ్తున్నారని సమాచారం అందడంతో వారి కోసం గాలించారు. పలు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత విద్యార్థునులను పోలీసులు పట్టుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ వార్తలు కూాడా చదవండి
CM Chandrababu: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే
YS Sharmila: ఐదేళ్లు దోచుకున్నారు.. బొత్సపై షర్మిల ఫైర్
Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే
Read Latest AP News And Telugu News