CM Chandrababu: రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. కారణమిదే..
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:54 PM
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ కమిటి భేటీ జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయొద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆధ్వర్యంలో ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ అందడంతో అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు. మీకు ఓపిక ఉంది...ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 22ఏ భూములు, ఇళ్ల స్థలాలు వెంటనే ఎందుకు పరష్కరించలేదని నిలదీశారు. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని సత్యప్రసాద్
రెవెన్యూ సదస్సులతో త్వరగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా ఏపీలో భూ సంబంధ సమస్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణమని అన్నారు. ఇప్పటి వరకు లక్షా 80 వేల అర్జీలు వచ్చాయని తెలిపారు. 13 వేల ఫిర్యాదులకు అక్కడిక్కడే పరిష్కరించామని అన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు 6 లక్షల మంది రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారని తెలిపారు. ఆర్ ఓ ఆర్‌లో తప్పులపై లక్షకుపైగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. భూమి సరిహద్దు సమస్యలపై 18 వేలకు పైగా అర్జీలు వచ్చాయన్నారు.రీసర్వే సమస్యలపై 11 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అసైన్డ్ ఇళ్ల స్థలాలపై ఆరు వేలకు పైగా ఫిర్యాదులు, 22 ఏ భూముల అక్రమాలపై 4,500 ఫిర్యాదులు అందాయని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.
విద్యుత్ వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నాం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాశనం చేసిన విద్యుత్ వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలోనే మొదటిసారిగా సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్‌తో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. దీని వల్ల 24గంటలూ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయొచ్చని చెప్పారు. విద్యుత్ రంగంలో ఇదో విప్లవాత్మక మార్పు అనే చెప్పాలని అన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టికి ఈ నూతన ప్రాజెక్టు ఓ నిదర్శనమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టినట్లే.. జగన్ చేసిన నష్టాలను వినూత్న విధానాలతో చంద్రబాబు భర్తీ చేస్తున్నారని ఉద్ఘాటించారు. దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కానుందని అన్నారు. సోలార్, విండ్ , బ్యాటరీ ద్వారా 24 x 7 విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. హీరో కంపెనీకు చెందిన క్లీన్ టెక్ గ్రూప్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీగా మండల సర్వసభ్య సమావేశం.. మాటల యుద్ధానికి దిగిన ఇరువర్గాలు..
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ మీటింగ్... కీలక అంశాలకు ఆమోద ముద్ర
Read Latest AP News and Telugu News