Minister Gottipati Ravikumar: వెలుగులోకి వైసీపీ భూ అక్రమాలు.. మంత్రి గొట్టిపాటి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jan 04 , 2025 | 08:13 PM
Minister Gottipati Ravikumar: వైసీపీ భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తులో భూ అక్రమాలు జరిగాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మంత్రి గొట్టపాటి సంచలన ఆరోపణలు చేశారు. సంతమాగులూరు తహసీల్దార్ ఆఫీసులో ఇవాళ(శనివారం) ప్రజావేదిక నిర్వహించారు. ప్రజల నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూసమస్యలనే మంత్రి దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై న్యాయం చేయాలంటూ మంత్రి గొట్టిపాటిని అర్జీదారులు కోరారు. స్థానిక అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రజావేదికలో అందిన ప్రతి అర్జీని రికార్డ్ చేసి పరిష్కరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. వైసీపీ భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలని హెచ్చరించారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది: మంత్రి పార్థసారథి
ఏలూరు: వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. శనివారం ఆగిరిపల్లిలో మంత్రి పార్థసారథి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి మంత్రి పార్థసారథి అర్జీలు స్వీకరించి బాధితుల సమస్యలను విన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.
వైసీపీ నేతల లక్ష్యమిదే: నాదెండ్ల బ్రహ్మం చౌదరి
అమరావతి: పేదవాళ్ల భూములు లాక్కోవడం, కబ్జా చేయడం వైసీపీ నేతల లక్ష్యమని తెలుగుదేశం పార్టీ యువనేత నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోపించారు. 22ఏ నిషేధ జాబితా నుంచి 1.88 కోట్ల ఎకరాల భూములకు విముక్తి లభించిందని అన్నారు. 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పించడంతో పేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు భూమి మీద హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వైసీపీ పాలనలో 13లక్షల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. విశాఖలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అడ్డగోలుగా భూములను దోచేశారని ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో 52 ఎకరాలు దోచుకున్నారన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు శ్మశానాలను కూడా వదల్లేదని విమర్శించారు. వైసీపీ నేతల భూ దోపిడీలను కూటమి ప్రభుత్వం వెలికితీస్తోందని హెచ్చరించారు. రెవెన్యూ సదస్సులతో వైసీపీ నేతల దోపిడీలు బయటకు వస్తున్నాయని అన్నారు. రానున్న 45 రోజుల్లో వైసీపీ నేతలు దోచుకున్న భూములను స్వాధీనం చేయకుంటే కఠిన చర్యలు ఉంటాయని నాదెండ్ల బ్రహ్మం చౌదరి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayawada: నేటి నుంచే ఆ పథకం స్టార్ట్.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్..
Atchannaidu: వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ
AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu news