Share News

Minister Mandipalli: జగన్‌కు శవరాజకీయాలు అలవాటు.. మంత్రి మండిపల్లి రాoప్రసాద్ రెడ్డి విసుర్లు

ABN , Publish Date - Jan 09 , 2025 | 02:06 PM

Minister Mandipalli Ramprasad Reddy: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు చెల్లని రూపాయిగా మారాయని మంత్రి మండిపల్లి రాoప్రసాద్ రెడ్డి ఆరోపించారు. జగన్‌కు శవరాజకీయాలు చేయడం బాగా అలవాటు అయిందని విమర్శించారు.

Minister Mandipalli: జగన్‌కు శవరాజకీయాలు అలవాటు.. మంత్రి మండిపల్లి రాoప్రసాద్ రెడ్డి విసుర్లు
Minister Mandipalli Ramprasad Reddy

అమరావతి: దురదృష్టవశాత్తూ జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటననూ రాజకీయం చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూడటం సరికాదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాoప్రసాద్ రెడ్డి అన్నారు. తండ్రి శవంతోనే రాజకీయం ప్రారంభించిన జగన్... సీఎం అయ్యేందుకు బాబాయ్ శవాన్ని వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. శవరాజకీయాలను పేటెంట్‌గా తీసుకున్న జగన్ ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ వాలటమే పనిగా పెట్టుకున్నారని మంత్రి మండిపల్లి రాoప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతికి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.


గతంలో పండుగ ప్రత్యేక సర్వీసులు అంటే ప్రయాణికులపై అదనపు బాదుడు ఉండేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రయాణికులపై అదనపు భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రైవేటు సర్వీసులు కూడా ఆర్టీసీతో సమానంగా టిక్కెట్ రేట్లు ఉండే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అతి త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుందని ప్రకటించారు. ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని వివరించారు. రాయలసీమ ప్రాంతంలో కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు సానుకూలంగా స్పందించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాటలు చెల్లని రూపాయిగా మారాయని మంత్రి మండిపల్లి రాoప్రసాద్ రెడ్డి ఆరోపించారు.


అధికారికంగా ఓబన్న జయంతిని నిర్వహిస్తాం: మంత్రి సవిత

savitha-minister.jpg

ఎన్డీయే కూటమి వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీలకు సంబంధించి విశ్వకర్మ జయంతి, వాల్మీకి జయంతిని ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించామని అన్నారు. ఇప్పుడు వడ్డే ఓబన్న జయంతిని కూడా ఘనంగా చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుంటూరులో ఈ నెల 11వ తేదీన జరపనుందని తెలిపారు. అదేవిధంగా అన్ని జిలాల్లో వడ్డే ఓబన్న జయంతి నిర్వహిస్తామని చెప్పారు. సామాజికంగా మేలు జరిగే కార్యక్రమాలు, పథకాలకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

Minister Anagani: తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్

YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 09 , 2025 | 02:27 PM