Andhra Pradesh: క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:01 PM
JC Prabhakar Reddy vs Madhavi Latha: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మరి ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పారు? అసలు ఏమైంది..? పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవాల్సిందే..
అనంతపురం, జనవరి 05: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మాధవి లత గురించి ఆవేశంలో మాట్లాడటం తప్పేనని అంగీకరించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన జేసీ.. మాధవి లతపై తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. తన వయసు 72 సంవత్సరాలు అని.. ఆవేశంలో మాట్లాడానే తప్ప ఎవరికీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరి బ్రతుకుతెరువు వారిదేనని అన్నారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ ఉద్ఘాటించారు. తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులందరూ ఫ్లెక్సీ గాళ్లేనంటూ విమర్శించారు. తాడిపత్రి కోసం ఎంత వరకైనా వెళ్తానని జేసీ మరోసారి వ్యాఖ్యానించారు.
ఇంతకీ ఏమైంది..
తాడిపత్రి మహిళల కోసం జేసీ పార్క్‌లో ప్రత్యేకంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు వెళ్లొద్దంటూ మాధవి లత పిలుపునిచ్చారు. గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని.. దాడులు చేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారమె. ఈ వ్యాఖ్యలపై జేసీ రియాక్ట్ అయ్యారు. ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు. తాడిపత్రి ప్రజలను గంజాయి బ్యాచ్‌తో పోలుస్తావా అంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మాట్లాడిన ఆయన.. మాధవి లతపై పరుష వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక వ్యభిచారి అని.. తనను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. బీజేపీ నేతలపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జేసీ చేసిన వ్యాఖ్యలపై మాధవి లత, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. జేసీకి వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆయన తీరును తప్పుపట్టారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా జేసీ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. మరి ఇంతటితోనైనా ఈ వివాదం ముగుస్తుందా? లేక మరింత రచ్చ జరుగుతుందా అనేది చూడాలి.
Also Read:
కాంగ్రెస్ అంటేనే మోసంకు నిర్వచనం..
‘గృహజ్యోతి’తో పెరిగిన విద్యుత్ డిమాండ్
For More Andhra Pradesh News and Telugu News..