APSRTC:సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:47 AM
APSRTC:సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు మీడియాకు వివరాలు తెలిపారు. ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం: సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు మీడియాకు వివరాలు తెలిపారు. ప్రయాణికులతో ద్వారకా బస్ స్టేషన్ రద్దీగా మారిందని అన్నారు. ఉత్తరాంధ్రతో పాటు హైదరాబాద్, విజయవాడ, సుదీర్ఘ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సంక్రాంతి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామని చెప్పారు.
నిన్న (శనివారం) 550 ఆర్టీసీ బస్సులు వేశామని...గత నాలుగు రోజుల నుంచి సుదీర్ఘ ప్రాంతాలకు వేళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచామని చెప్పారు. సాధారణ చార్జీలతోనే ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని అన్నారు. ఉత్తరాంధ్రకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 22వ తేదీ వరకు రిటర్న్ జర్నీ కోసం బస్సులు కూడా నడుపుతున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Sankranthi Kodi Pandalu:జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లు
Leopard Attacks : టీటీడీ ఉద్యోగిపై దాడికి యత్నించిన చిరుత
TDP Minister : మా వాళ్లే వదిలేయ్!
Read Latest AP News and Telugu News