Share News

CM Chandrababu: ఉగ్రదాడి మృతులకు సీఎం చంద్రబాబు సంతాపం

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:57 PM

CM Chandrababu: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడులను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ దాడిలో విశాఖపట్నం జిల్లా వాసి చంద్రమౌలి మృతిచెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

CM Chandrababu: ఉగ్రదాడి మృతులకు సీఎం చంద్రబాబు సంతాపం
CM Chandrababu

అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ తెలుగు సంఘం సభ్యులు జేఎస్ చంద్రమౌళి, మధుసూదన్‌లకి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో తమ ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబాలకు అండగా ఉన్నాయని, ఈ అపారమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని తాను ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మచ్చ అని సీఎం చంద్రబాబు చెప్పారు.


ఉగ్రవాదం, హింస వారు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ఏదీ సాధించలేరని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావంగా నిలుస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీవ్రవాదంపై ధృఢమైన, నిర్ణయాత్మక చర్యతో ప్రతిస్పందించడానికి తమ నిబద్ధతతో ఉన్నారని చెప్పారు. ఈ హేయమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.


చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

అమరావతి నుంచి హెలికాఫ్టర్‌లో ఇవాళ ఒంగోలుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా గన్నవరానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ఆ తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 10 గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనుంది. ఈరోజు రాత్రికి విశాఖపట్నంలోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు. చంద్రమౌళి మృతదేహం ఈ రాత్రికి విశాఖ చేరుకున్న తర్వాత సీఎం చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. రేపు ఉదయం చంద్రమౌళి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు సాయంత్రం విశాఖపట్నం నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు.


ఉగ్రదాడి తీవ్రంగా కలిచి వేసింది: మంత్రి నారాయణ

Narayana.jpg

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి దారుణ సంఘటన అని, ఈ దాడి తీవ్రంగా కలిచి వేసిందని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూధనరావు మృతి చాలా బాధకలిగించిందని అన్నారు. మధుసూదనరావు మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉగ్రదాడిలో మృతులకు నివాళులు అర్పిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు.


ఉగ్రదాడి అమానుషం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Anam.jpg

నెల్లూరు: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి దారుణ సంఘటన అని, ఈ దాడి తీవ్రంగా కలిచివేస్తుందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు ఉండటం చాలా బాధిస్తుందని అన్నారు. వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం, తామంతా అండగా ఉంటామని తెలిపారు. ఉగ్రదాడిలో మృతులకి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాళులు అర్పించారు.


ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేసింది: ఎంపీ వేమిరెడ్డి

Vemireddy-Prabhakar-Reddy.jpg

నెల్లూరు: జమ్మూ కాశ్మీర్‌లో జరిగి‌న ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ట్రెక్కింగ్‌కి వెళ్లిన టూరిస్టులపై కాల్పులు జరిపి హతమార్చడం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఉగ్రదాడి పిరికిపంద చర్య అని తెలిపారు. మృతుల కుటుంబాలకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


ఉగ్రదాడి కుటుంబాలకు అండగా ఉంటాం: మంత్రి నిమ్మల రామానాయుడు

Minister Nimmala.jpg

పహాల్గం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులు అర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులు దైర్యంగా ఉండాలని చెప్పారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


ఆ ఘటన తీవ్రంగా కలచివేసింది: ఎంపీ అప్పలనాయుడు

Kalisetti-AppalaNaidu.jpg

కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం వాసి చంద్రమౌళి మరణించిన ఘటన తీవ్రంగా కలచివేసిందని విజయనగరం తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సంప్రదింపులు జరిపారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, మన రాష్ట్ర ఎంపీలు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఘటనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Andhra Pradesh Liquor Scam: జగన్‌ చెప్పారు.. నేను చేశాను!

PSR Anjaneyulu: అరెస్టు చేసినా అదే బాసిజం

Chandrababu Naidu: కేంద్రమంత్రి మేఘవాల్‌ ఇంట్లో ‘సైకిల్‌’పై చర్చ

Heatwave: ఎండదెబ్బకు ఒక్క ప్రాణమూ పోకూడదు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 01:40 PM