Share News

Minister Narayana: స్పీడందుకున్న విశాఖ మెట్రో పనులు.. మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:44 PM

Minister Narayana: విశాఖ అభివృద్ధిపై మంత్రి నారాయణ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Minister Narayana: స్పీడందుకున్న విశాఖ మెట్రో  పనులు.. మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
Minister Narayana

విశాఖపట్నం: భోగాపురం ఎయిర్ పోర్ట్ రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. ఇందుకోసం రోడ్ల విస్తరణ చేయాల్సి ఉందని అన్నారు.ఈ ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో ఇవాళ(శుక్రవారం) మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధి, మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కనెక్టివిటీ, ఇతర ట్రాఫిక్ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇవాళ వీఎంఆర్డీఏ పరిధి మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష చేశామని అన్నారు. గతంలో స్వార్థం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని చెప్పారు. ఫైనల్ చేసిన మాస్టర్ ప్లాన్‌ను ఆన్‌లై‌లో ఉంచుతామని మంత్రి నారాయణ అన్నారు.


ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ నాలుగు నెలల్లో ఫైనల్ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ అంటే రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని చేయాలని చెప్పారు. కొన్ని చోట్ల రోడ్ల పరిధిని పెంచడంపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు. మెట్రో రైల్ కూడా మాస్టర్ ప్లాన్‌లో భాగమేనని తెలిపారు. 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లై ఓవర్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ డబుల్ డెక్కర్ రోడ్లు ప్లాన్ చేసేలా ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారని అన్నారు. టీడీఆర్ బాండ్ల విషయం అందరికీ తెలుసునని చెప్పారు. టీడీఆర్ బాండ్లపై అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


టౌన్ ప్లానింగ్‌పై చర్చ..

టౌన్ ప్లానింగ్‌లో తీసుకువచ్చిన సంస్క‌ర‌ణ‌ల అమ‌లు, మ‌రిన్ని మార్పుల‌పై మంత్రి నారాయ‌ణ చర్చించారు. భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తుల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ స‌మావేశానికి మున్సిప‌ల్ శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్, టౌన్ ప్లానింగ్ డైరెక్ట‌ర్ విద్యులత‌, క్రెడాయ్, న‌రెడ్కో, ఎల్టీపీ అసోసియేష‌న్‌ల ప్ర‌తినిధులు హాజ‌రయ్యారు. భ‌వ‌న నిర్మాణాల‌కు సెట్ బ్యాక్ నిబంధ‌న‌లు స‌ర‌ళ‌త‌రం చేసేలా చ‌ర్చించినట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇటీవ‌ల తీసుకువచ్చిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌గ‌డ్బందీగా అమ‌లు చేయ‌డంపై మంత్రి నారాయ‌ణ‌ ప‌లు సూచ‌న‌లు జారీ చేశారు.


కీలక నిర్ణయాలు తీసుకున్నాం: కొణతాల రామకృష్ణ

వైజాగ్ అభివృద్ధిపై ఇవాళ జరిగిన సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. గతంలో ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేశారని అన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ మళ్లీ రూపొందించే ఆలోచన చేశామని చెప్పారు. నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ పక్కగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. 22ఏ భూములు, తాగు నీటి సమస్యలు, బీచ్ క్యారీడర్, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. చాలా కాలంగా అనకాపల్లి, గాజువాక భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటి పరిష్కారానికి మంత్రి నారాయణ ఆమోదం తెలిపారని కొణతాల రామకృష్ణ అన్నారు.


పల్లా శ్రీనివాసరావు ఏమన్నారంటే..

palla-srinivas.jpg

భోగాపురం ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష చేయడం మంచిదేనని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని రోడ్లకు పక్కన చిన్న చిన్న స్థలాలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడమని మంత్రి నారాయణను కోరామని అన్నారు. అధికారులు మారడం వల్ల అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష విసృత్తంగా చేయాలని చెప్పామని పల్లా శ్రీనివాసరావు అన్నారు.


వైజాగ్‌ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

vishnukumar-raju-bjp.jpg

విజన్ 2047పై ఫోకస్ పెట్టినట్లుగానే వైజాగ్‌ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖా చాలా కీలకమని అన్నారు. వైజాగ్ మాస్టర్ ప్లాన్‌లో కొన్ని లొసుగులు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ సెట్ రైట్ చేయాలని కోరామన్నారు. వీఎంఆర్డీఏ నుంచి కార్పొరేట్ ఆస్పత్రికి భూములు ఇచ్చి పదిశాతం వరకు ఉచిత వైద్యం చేయాలని చెప్పామని.. అది జరగడం లేదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Marri Rajasekhar: నన్ను అవమానించారు.. విడదల రజినీపై మర్రి రాజశేఖర్‌ ఫైర్

Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే

CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 04:56 PM