Share News

Delhi Election 2025 Results Live:చంద్రబాబు క్రేజ్ గురించి విజయోత్సవ సభలో ప్రస్తావించిన మోదీ

ABN , First Publish Date - Feb 08 , 2025 | 06:56 AM

Delhi Election 2025 Results Live Updates in Telugu News: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు లెక్కలు మారుతున్నాయి. తొలుత వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు కాస్త లీడ్‌లోకి వచ్చారు. ప్రస్తుతానికి బీజేపీ లీడ్‌లో ఉండగా.. చివరి వరకు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది..

Delhi Election 2025 Results Live:చంద్రబాబు క్రేజ్ గురించి విజయోత్సవ సభలో ప్రస్తావించిన మోదీ
Delhi Assembly Election Results 2025 LIVE

Live News & Update

  • 2025-02-08T19:12:17+05:30

    బీజేపీ విజయోత్సవ సభలో మోదీ..

    • బీజేపీ విజయోత్సవ సభలో చంద్రబాబు పేరు ప్రస్తావించిన మోదీ

    • ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నారు

    • ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది

    • చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మోదీ

    • ఢిల్లీలో బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం

  • 2025-02-08T18:54:49+05:30

    బీజేపీ విజయోత్సవ సభలో మోదీ..

    • ఢిల్లీ ప్రజల్లో ఇవాళ ఉత్సాహం కనిపిస్తోంది

    • ఢిల్లీని వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చారు

    • ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించింది

    • ఢిల్లీ ప్రజలు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకున్నారు

    • ఢిల్లీ ప్రజలు బీజేపీని మనసారా ఆశీర్వదించారు

  • 2025-02-08T18:47:10+05:30

    బీజేపీ కేంద్ర కార్యాలయంలో మోదీ..

    • ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ సభ

    • ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో సభ

    • పాల్గొన్న ప్రధాని మోదీ, జేపీ నడ్డా

    • ఆప్‌ అవినీతిని ప్రజలు ఊడ్చేశారు- నడ్డా

    • ఆప్ అవినీతిపై చర్యలు తప్పవు- నడ్డా

    • ఢిల్లీ ప్రజలను ఇంకా మోసంవ చేయాలని కేజ్రీీవాల్ చూశారు- నడ్డా

    • ఢిల్లీలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది- నడ్డా

  • 2025-02-08T15:18:41+05:30

    ఆ ముగ్గురూ క్లీన్ బౌల్డ్

    • ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం

    • ముగ్గురు కీలక నేతల ఓటమి

    • మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఓటమి

    • అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యందర్ జైన్ ఓటమి

  • 2025-02-08T13:48:39+05:30

    చంద్రబాబు కీలక ప్రెస్‌మీట్.. టైమ్ ఇదే..

    • అమరావతి: శనివారం సాయంత్రం 4 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం.

    • ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడే అవకాశం.

    • ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.

    • చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించిన నియోజకవర్గంలో గెలిచిన బీజేపీ అభ్యర్థి.

  • 2025-02-08T13:07:45+05:30

    ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆప్ కీలక నేతలు

    • న్యూ ఢిల్లీ అసెంబ్లీ బరిలో ఆఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజ.

    • ఓటమి చెందిన నేతలు మనీష్ సిసోడియా, సౌరవ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి.

  • 2025-02-08T13:05:23+05:30

    న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ ఓటమి

    • కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌ వర్మ గెలుపు

    • మనీష్‌ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్‌ విజయం

    • షాకుర్‌బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్ర జైన్‌ ఓటమి

    • సత్యేంద్ర జైన్‌పై బీజేపీ అభ్యర్థి కర్నాల్‌ సింగ్‌ విజయం

    • బీజేపీ అభ్యర్థి రమేశ్‌ బిధూరిపై సీఎం అతిశీ గెలుపు

    • చివరి రౌండ్‌లో అతిశీ అనూహ్య విజయం

  • 2025-02-08T13:04:31+05:30

    ఢిల్లీ: అమిత్‌ షాతో పర్వేశ్‌ వర్మ భేటీ

    • కేజ్రీవాల్‌పై గెలుపొందిన పర్వేష్‌ వర్మ

    • ఢిల్లీ సీఎం రేసులో ఉన్న పర్వేష్‌ సింగ్‌ వర్మ

  • 2025-02-08T13:04:04+05:30

    కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం

    • బీజేపీ అభ్యర్థి రమేశ్‌ బిధూరిపై అతిశీ గెలుపు

    • చివరి రౌండ్‌లో అతిశీ అనూహ్య విజయం

  • 2025-02-08T12:53:15+05:30

    తెలంగాణపై ఢిల్లీ ఎన్నికల ఫలితాలు..: డీకే అరుణ

    • ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి.

    • 27 ఏళ్ల తరువాత అవినీతి సామ్రాజ్యం హస్తినలో కూలింది.

    • మార్పు కోసమే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించారు.

    • నేను అనేక చోట్ల ప్రచారంలో పాల్గొన్నాను.

    • దేశ రాజధానిలో మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదు.

    • అధ్యక్ష రేసులో నేను ఉండొచ్చు.

    • అది హై కామండ్ నిర్ణయం.

    • రేవంత్ రెడ్డికి లోకల్‌బాడీ ఎన్నికల భయం పట్టుకుంది.

    • అందుకే ముందు జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు తరువాత సర్పంచ్ ఎన్నికలు అంటున్నాడు.

    • స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం ఎదురవుతోంది.

  • 2025-02-08T12:35:20+05:30

    మనీష్ సిసోడియా ఓటమి..

    • జంగ్‌పురాలో స్థానంలో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా ఓటమి.

    • 636 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్.

  • 2025-02-08T12:21:11+05:30

    గాడిద గుడ్డు వచ్చింది: రఘునందన్ రావు

    • మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటి చేసే మొహం లేని వాళ్ళు మాట్లాడితే మాట్లాడాల్సిన అవసరం లేదు.

    • కేటిఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్.

    • ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిదగుడ్డు ఒచ్చింది.

    • ఇది రేవంత్ రెడ్డికి గుణ పాఠం కావాలి.

    • స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఢిల్లీ ఫలితాలే పునరావృతం అవుతాయి.

  • 2025-02-08T12:02:46+05:30

    ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే షాకింగ్ కామెంట్స్..

    ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. జీవితంలో దోషాలు లేకుండా ఉండాలి. త్యాగ నిరతి ఉండాలి. ఈ గుణాలు ఓటర్లలో విశ్వాసం కలిగిస్తాయి. నేను ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్‌కు చెప్పాను. కానీ, ఆయన దానిని పట్టించుకోలేదు. చివరకు మద్యంపై దృష్టి సారించాడు. డబ్బుపై వ్యామోహంతో ఉన్నాడు. అందుకే నేడు ఈ పరాజయం.’ అని అన్నా హజారే విరమ్శించారు.

  • 2025-02-08T11:35:26+05:30

    ఢిల్లీ: కేజ్రీవాల్‌కు చుక్కలు చూపిస్తున్న పర్వేష్ శర్మ..

    • న్యూఢిల్లీ అసెంబ్లీ బరిలో ముందంజలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.

    • 238 ఓట్ల ఆధిక్యంలో పర్వేష్ వర్మ.

    • వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్.

  • 2025-02-08T11:20:00+05:30

    ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందన

    • రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు.

    • ఢిల్లీలో బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి.

    • శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ సెటైర్స్.

  • 2025-02-08T11:19:13+05:30

    ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చిందంటే..

    • ఆప్ - 43.42 శాతం.

    • బీజేపీ - 46.89 శాతం.

    • కాంగ్రెస్ - 6.57 శాతం.

  • 2025-02-08T11:16:39+05:30

    ఆప్, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు..

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. దాదాపు 15 నియోజకవర్గాల్లో ఆప్, బీజేపీ మధ్య 3000 లోపు ఓట్ల మార్జిన్ మాత్రమే ఉంది. ఈ స్థానాల్లో పరిస్థితి మారితే.. పార్టీల ఆశలే గల్లంతయ్యే అవకాశం ఉంది.

  • 2025-02-08T10:49:23+05:30

    ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన..

    Union Minister Bandi Sanjay

    • డిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారు.

    • ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను డిల్లీ ప్రజలు కోరుకున్నారు.

    • అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దు అనుకున్నారు.

    • డిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందే.

    • మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారు.

    • తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం.

    • రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సి స్థానాల్లో విజయం సాధిస్తుంది.

    • రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ ఉపాద్యాయులు ఆలోచించి ఓటు వేయాలి.

    • శాసనసభలో ప్రజల సమస్యలను ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే.

  • 2025-02-08T10:47:32+05:30

    ఢిల్లీ: మనిష్ సిసోడియా వెనుకంజ

    • జంగ్‌పురా స్థానంలో ఆప్ అభ్యర్థి సిసోడియా వెనుకంజ.

    • బిజేపి అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా ముందంజలో ఉన్నారు.

  • 2025-02-08T10:46:54+05:30

    • ఢిల్లీ: షాద్రా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ ముందంజ.

    • 3130ఓట్ల ఆధిక్యం లో సంజయ్ గోయల్.

    • సంజయ్ గోయల్ కోసం ప్రచారం చేసిన చంద్రబాబు.

    • తెలుగు వారు అధికంగా ఉన్న నియోజకవర్గం గా షాద్రా.

  • 2025-02-08T10:29:20+05:30

    బీజేపీ శ్రేణుల సంబురాలు..

  • 2025-02-08T10:28:24+05:30

    ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్: వీరేంద్ర సచదేవా

    ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. 42 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచదేవా.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందన్నారు.

  • 2025-02-08T09:58:25+05:30

    ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మారుతున్న లెక్కలు..

    ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో లెక్కలు మారుతున్నాయి. ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు కాస్త ముందుకొచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ వెనుకంజలో ఉన్నారు.

  • 2025-02-08T09:51:11+05:30

    దటీజ్ సీఎం చంద్రబాబు..

    • ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం చేసిన షాదారా, విశ్వాస్‌నగర్‌, సంగంవిహార్‌, సహద్రలో బీజేపీ ముందంజ

  • 2025-02-08T09:47:19+05:30

    ఎన్నికల కమిషన్ ప్రకారం బీజేపీ ఎన్ని స్థానాల్లో ముందంజలో ఉందంటే..

    • ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం బీజేపీ మెజారిటీ మార్క్‌ను దాటేసింది. బీజేపీ 36 స్థానాల్లో, ఆప్ 16 స్థానాల్లో ముందంజలో ఉంది.

  • 2025-02-08T09:14:21+05:30

    27 ఏళ్ల తరువాత అధికారం దిశగా బీజేపీ..

    • ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.

    • ఇప్పటికే అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్(36)ను దాటేసింది.

    • బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

    • ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేసిన షహరాబాద్‌లో బీజేపీ ముందంజ

  • 2025-02-08T08:50:54+05:30

    మేజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ..

    bjp.jpg

    ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ట్రెండ్సే కనిపిస్తున్నాయి. అందరూ అనుకున్నట్లే బీజేపీ దూసుకెళ్తోంది. బ్యాలెట్ ఓట్లలో బీజేపీ మేజిక్ ఫిగర్ 36 సీట్లలో మెజారిటీ సాధించింది. ఆప్ కేవలం 24 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. ఆప్ ముఖ్యనేతలంతా వెనుకంజలో ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో కల్యాజ్‌లో సీఎం అతిశీ వెనుకంజలో ఉండగా, జంగ్‌పురాలో మనీష్‌ సిసోడియా, న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ వెనుకబడిపోయారు.

  • 2025-02-08T08:40:33+05:30

    గెలిపించు స్వామీ..!

  • 2025-02-08T08:38:54+05:30

    పోస్టల్ బ్యాలెట్లో ఆప్‌కు ఝలక్..

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వెనుకబడిపోయారు. సీఎం అతిశీ, మనీష్‌, కేజ్రీవాల్‌ వెనుకంజలో ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో కల్యాజ్‌లో సీఎం అతిశీ వెనుకంజలో ఉండగా, జంగ్‌పురాలో మనీష్‌ సిసోడియా, న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ వెనుకబడిపోయారు. కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి ప్రవేశవర్మ ముందంజలో ఉన్నారు. కల్కాజీలో సీఎం అతిశీపై బీజేపీ అభ్యర్థి రమేష్‌, బాదిలి స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్రయాదవ్‌, షాకుర్‌ బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్ర జైన్‌ ముందంజలో ఉన్నారు.

  • 2025-02-08T08:33:05+05:30

    కేజ్రీవాల్‌కు షాక్..

    • కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి ప్రవేశవర్మ ముందంజ.

    • కల్యాజీలో సీఎం అతిశీపై బీజేపీ అభ్యర్థి రమేష్‌ ముందంజ.

  • 2025-02-08T08:21:23+05:30

    • జంగ్‌పురాలో మనీష్‌ సిసోడియా వెనుకంజ

    • న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ వెనుకంజ

    • కాల్యాజ్‌లో సీఎం అతిశీ వెనుకంజ

    • పోస్టల్‌ బ్యాలెట్‌లో ఆప్‌ ముఖ్యనేతలు వెనుకంజ

  • 2025-02-08T08:09:02+05:30

    • కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు

    • పోస్టల్‌ బ్యాలెట్‌లో 2 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

  • 2025-02-08T08:05:36+05:30

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

    • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం

    • 19 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

    • మొత్తం అసెంబ్లీ సీట్లు 70, మేజిక్‌ ఫిగర్‌ 36

  • 2025-02-08T08:03:00+05:30

    ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీదే అధికారం అంటున్న విశ్లేషకులు

    • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌, బీజేపీ మధ్య ప్రధాన పోరు

    • 2015 నుంచి అధికారంలో ఉన్న ఆప్‌

    • 27 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రావాలన్న పట్టుదలలో బీజేపీ

    • 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన ఆప్‌

  • 2025-02-08T07:48:30+05:30

    మళ్లీ ఆప్‌దే అధికారం..

    ‘ఇవి సాధారణ ఎన్నికలు కాదు. మంచికి చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం. నాకు నమ్మకం ఉంది. ఢిల్లీ ప్రజలకు మంచినే ఆదరిస్తారు. ఆప్, అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి పట్టం కడుతారు. నాలుగోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారు.’ అని ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి ధీమా వ్యక్తం చేశారు.

  • 2025-02-08T07:19:53+05:30

    అందరి ధీమా గెలుపుపైనే.. మరి జరిగేదేంటో..

  • 2025-02-08T07:11:22+05:30

    కౌంటింగ్ మొదలయ్యే టైమ్ ఇదే..

    ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం అంటే ఫిబ్రవరి 8, 2025 ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నాటికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మూడు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్‌లలో ఏ పార్టీ ఢిల్లీని చేజిక్కించుకుంటుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

  • 2025-02-08T06:56:40+05:30

    Delhi Election Results 2025 Live Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా నాలుగోసారి అధికారంలోకి రానుందా.. కమలనాథులు 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారా.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఓట్ల లెక్కింపు కోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈనెల 5వ తేదీన పోలింగ్‌ జరుగగా.. 60.54 శాతం ఓటింగ్‌ నమోదైంది. తమ పార్టీ దగ్గర దగ్గరగా 50 సీట్లు కైవసం చేసుకుని.. అధికారంలోకి వస్తుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పుతాయని, కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్‌ చెబుతోంది. మరి హస్తినలో ఏం జరుగుతుందోనని దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.