Share News

Delhi Assembly Elections 2025: ఢిల్లీ పీఠం దక్కాలంటే ఎన్ని సీట్లు గెలవాలి.. 3 పార్టీల ధీమా ఏంటి

ABN , Publish Date - Feb 08 , 2025 | 08:09 AM

Delhi Assembly Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వేళైంది. ఢిల్లీని ఏలేది ఎవరో ఇవాళ తేలిపోనుంది. కొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో గద్దెనెక్కాలంటే ఎంత మ్యాజిక్ ఫిగర్ కావాలో ఇప్పుడు చూద్దాం..

Delhi Assembly Elections 2025: ఢిల్లీ పీఠం దక్కాలంటే ఎన్ని సీట్లు గెలవాలి.. 3 పార్టీల ధీమా ఏంటి
Delhi Assembly Election 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్రిముఖ పోటీ నెలకొనడంతో ఈసారి ఎవరు గెలుస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పట్టుదలతో ఉంది. 26 ఏళ్లుగా పవర్‌కు దూరంగా ఉన్న బీజేపీ.. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ కూడా పవర్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 3 పార్టీలకు ఉన్న ధీమా ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


బీజేపీలో ధీమాకు కారణం!

ఢిల్లీలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 70. ఇందులో 36 సీట్లు గెలిచిన పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ చేరుకుంటుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 5వ తేదీన జరిగిన పోలింగ్‌లో 60.54 శాతం మంది ఢిల్లీ వాసులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70 సీట్లలో 39 వరకు బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 50 సీట్లలో విజయకేతనం ఎగురవేస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అనుకూలంగా రావడంతో కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈసారి విజయం తమదేనని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నారు.


అధికారం మాదే!

ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రాకపోయినా గెలుపు తమదేనని ఆప్ నేతలు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వాళ్లు కొట్టిపారేస్తున్నారు. తమ అధికారానికి ఎదురులేదని.. పవర్‌లోనే కంటిన్యూ అవుతామని అంటున్నారు. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమేనని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తాము అమలు చేసిన పథకాలు తమను గెలిపిస్తాయనే విశ్వాసంతో కనిపిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ డకౌట్ అయిన కాంగ్రెస్.. ఈసారి సీన్ మారుతుందని అంటోంది. మరి.. ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.


ఇదీ చదవండి:

విదేశాల్లోని జైళ్లలో 10,152 మంది భారతీయులు

ఐదు నెలల్లో 39 లక్షల కొత్త ఓటర్లా?

నిరాడంబరంగా అదానీ చిన్న కొడుకు పెళ్లి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2025 | 08:26 AM