Share News

Viral Video: వార్నీ.. వీడేంట్రా మరీ కామెడీగా ఉన్నాడే.. భిక్షం అడిగితే ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Jan 22 , 2025 | 08:58 AM

ఓ వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ ఓ ఇంటి వద్దకు వెళ్తాడు. అ ఇంటి ముందు పిల్లాడు తప్ప పెద్ద వారు ఎవరూ ఉండరు. దీంతో అతను భిక్షం వేయమని ఆ పిల్లాడినే అడుగుతాడు. ఆ బాలుడు కూడా ఎంతో బుద్ధిగా ఒక కప్పు తీసుకుని మూటలోని బియ్యం తీసుకుని అతడి చేతికి అందిస్తాడు. అయితే చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూసి భిక్షగాడు షాక్ అయ్యాడు..

Viral Video: వార్నీ.. వీడేంట్రా మరీ కామెడీగా ఉన్నాడే.. భిక్షం అడిగితే ఏం చేశాడో చూడండి..

పిల్లలు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నిసార్లు ఆలోచింపజేసేలా ఉంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు తెగ నవ్విస్తుంటాయి. చాలా మంది పిల్లలు ఎదుటి వారిని ఆటపట్టించడం చూస్తుంటాం. ఈ క్రమంలో వారు చేసే పనులు తోటి వారికి కోపం తెప్పించినా.. చూసే వారికి మాత్రం తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లాడు భిక్షం అడిగిన వ్యక్తితో తమాషా చేయడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీడేంట్రా మరీ కామెడీగా ఉన్నాడే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ ఓ ఇంటి వద్దకు వెళ్తాడు. అ ఇంటి ముందు పిల్లాడు తప్ప పెద్ద వారు ఎవరూ ఉండరు. దీంతో అతను భిక్షం వేయమని ఆ పిల్లాడినే అడుగుతాడు. ఆ బాలుడు కూడా ఎంతో బుద్ధిగా ఒక కప్పు తీసుకుని మూటలోని బియ్యం తీసుకుని అతడి చేతికి అందిస్తాడు.

Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. అడవిలోకి వెళ్లిన వారిపై ఎలుగుబంటి దాడి.. చూస్తుండగానే..


ఎంతో ఆనందంతో కప్పు బియ్యాన్ని తీసుకున్న ఆవ్యక్తి.. వాటిని సంచిలో వేయాలని చూసి ఒక్కసారిగా అవాక్కవుతాడు. తలకిందులుగా ఉన్న కప్పుపై కొన్ని బియ్యాన్ని నింపినట్లు తెలుస్తుంది. ఇలా బోర్లించిన కప్పుపై బియ్యం పోసి, భిక్షగాడిని (beggar) ఫూల్‌ను చేశాడు. ఆ బుడ్డోడి నిర్వాకం చూసి భిక్షగాడికి కోపం వస్తుంది. కానీ చేసేదేమీలేక ముఖం చిరాకుగా పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Viral Video: ఓర్నీ దుంపతెగా..! కోతుల పాలిట యముడిలా తయారయ్యాడుగా.. ఎలా భయపెడుతున్నాడో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బుడ్డోడి కామెడీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘భిక్షాటన చేస్తున్న వారి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.67 లక్షలకు పైగా లైక్‌లు, 5.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 22 , 2025 | 08:58 AM