Viral Video: ఏమైందిరా..! ఓ వైపు ఊరేగింపు జరుగుతుండగా.. మరోవైపు వీళ్ల నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..
ABN , Publish Date - Jan 19 , 2025 | 07:04 PM
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. అన్ని వివాహ కార్యక్రమాల్లో జరిగినట్లుగానే ఈ వివాహంలోనూ వధూవరులను రథంపై కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊహించని ఘటన చోటు చేసుకుంది..

ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లు వింతలు, వినోదాలు, షాకింగ్ ఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. ఏ పెళ్లయినా అందులో ఏదో ఒక వింత ఘటన చోటు చేసుకోవడం, లేదంటే క్రియేట్ చేసి మరీ నెటిజన్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే ఘటనలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఊరేగింపు జరుగుతుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లైట్లు మోసుకుంటూ వెళ్తున్న వారు కాస్తా.. చివరకు అందరికీ షాక్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. అన్ని వివాహ కార్యక్రమాల్లో జరిగినట్లుగానే ఈ వివాహంలోనూ వధూవరులను (Procession of bride and groom) రథంపై కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహించారు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. ఊరేగింపు సరే.. ఈ సందర్భంగా అందులో లైట్లు మోస్తున్న వారు చేసిన నిర్వాకమే వీడియో వైరల్ అవడానికి కారణమైంది.
Viral Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదేనేమో.. పెళ్లిలో ఈ సీన్ చూస్తే కళ్లు తేలేస్తారు..
ఊరేగింపులో వధూవరుల రథానికి రెండు వైపులా రంగు రంగుల దీపాలను మొసుకుంటూ వెళ్లగం చూస్తుంటాం కదా. ఇక్కడ కూడా అలాగే దీపాల స్టాండ్‌లను వరుసగా మోసుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. బ్యాండు బృందంలో లైట్లు మోస్తున్న ఇద్దరు యువకుల మధ్య (Quarrel between band members) ఉన్నట్టుండి గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవ కాస్తా చివరకు తన్నుకోవడం వరకూ వెళ్లింది. ఊరేగింపులో దీపాలు మోయడానికి వచ్చామనే విషయాన్ని కూడా మర్చిపోయి.. ఒకరినొకరు తన్నుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో వారి చేతిలోని లైట్లు కూడా కిందపడిపోతాయి. వీరి గొడవతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Viral Video: వడ్డిస్తున్నారా.. మ్యాజిక్ చేస్తున్నారా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..
ఈ గొడవలో ఓ యువకుడు మరో యువకుడి కడుపుతో బలంగా తన్నడంతో నొప్పితో విలవిల్లాడిపోతాడు. చివరకు కొందరు అక్కడికి చేరుకుని వారిని విడిపించడంతో గొడవ సర్దుమణుగుతుంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లి భరాత్ అంటే ఈ మాత్రం ఉండాలిగా’’.. అంటూ కొందరు, ‘‘ఎవడిగోల వాడిదే అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..