Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. అడవిలోకి వెళ్లిన వారిపై ఎలుగుబంటి దాడి.. చూస్తుండగానే..
ABN , Publish Date - Jan 22 , 2025 | 08:36 AM
కలప కోసం అడవిలోకి వెళ్లిన తండ్రీకొడుకులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. వారిని రక్షించడానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

అడవిలో పర్యటిస్తున్న సమయంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పర్యాటకులతో పాటూ అప్పుడప్పుడూ ఫారెస్ట్ సిబ్బంది కూడా పులులు, సింహాలు, ఎలుగుబంట్ల దాడికి గురవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో్ కొందరు అదృష్టం బాగుండి తృటిలో తప్పించుకుంటుంటే.. మరికొందరు వాటి దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవిలోకి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కాంకేర్ జిల్లా దొంగరకట్ట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుక్లాల్ దర్రో (45), అజ్జు కురేటి (22) అనే తండ్రీ కొడుకులు శనివారం కలప కోసం అడవిలోకి వెళ్లారు. కలప సేకరిస్తున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Viral Video: భార్య ముందు సింహం కూడా పిల్లిగా మారాల్సిందే.. వీడియో చూస్తే పడిపడి నవ్వుతారు..
అదే ప్రాంతంలో మాటు వేసి ఉన్న ఎలుగుబంటి వారిని టార్గెట్ చేసింది. ఒక్కసారిగా (Bear attack on father and son) వారిపై దాడి చేసింది. దాన్నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా వారి వల్ల సాధ్యం కాలేదు. ఎలుగుబంటి దాడి చేయడాన్ని గమనించిన ఫారెస్ట్ సిబ్బంది నారాయణ్ యాదవ్.. వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎలుగుబంటి అతడిపై కూడా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అజ్జు కురేటి అక్కడికక్కడే చనిపోగా.. సుక్లాల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Viral Video: ఓర్నీ దుంపతెగా..! కోతుల పాలిట యముడిలా తయారయ్యాడుగా.. ఎలా భయపెడుతున్నాడో చూస్తే..
ఫారెస్ట్ సిబ్బంది నారాయణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఎలుగుబంటి దాడి ఘటన మొత్తం వారి ఫోన్లలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘క్రూరమృగాలు సంచరించే ప్రాంతంలోకి వెళ్లడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 80 వేల మందికి పైగా వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..