Share News

Viral Video: చలికాలంలో ఇంత కంటే బెస్ట్ ట్రిక్ ఉండదేమో.. హీటర్‌తో ఇతను చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Jan 21 , 2025 | 11:58 AM

ఓ వ్యక్తి చలికాలంలో వేడి నీటి స్నానం చేసేందుకు విచిత్రంగా ఆలోచించాడు. సాధారణంగా కొందరు బాత్రూంలో గీజర్లు ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు కట్టెల పొయ్యి మీద లేదా బకెట్లలో హీటర్ పెట్టి నీటిని వేడి చేసుకుని స్నానం చేస్తారు. అయితే..

Viral Video: చలికాలంలో ఇంత కంటే బెస్ట్ ట్రిక్ ఉండదేమో.. హీటర్‌తో ఇతను చేసిన పని చూస్తే..

ఇళ్లలోని వస్తువులతో కొందరు వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. ఫ్రిడ్జ్, కూలర్‌ను వినియోగించి ఇంట్లో ఏసీ తరహా ఏర్పాట్లు చేయడం, ఇండియన్ టాయిలెట్‌లో వెస్ట్రన్ ఏర్పాట్లు చేయడం చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ వ్యక్తి వేడి నీటి కోసం చేసిన వింత ట్రిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు. హీటర్‌తో అతను చేసిన నిర్వాకం చూసి అంతా.. ‘‘చలికాలంలో ఇంత కంటే బెస్ట్ ట్రిక్ ఉండదేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చలికాలంలో వేడి నీటి స్నానం (Hot water bath in winter) చేసేందుకు విచిత్రంగా ఆలోచించాడు. సాధారణంగా కొందరు బాత్రూంలో గీజర్లు ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు కట్టెల పొయ్యి మీద లేదా బకెట్లలో హీటర్ పెట్టి నీటిని వేడి చేసుకుని స్నానం చేస్తారు. అయితే ఇతను మాత్రం ఇంకాస్త వెరైటీగా ఆలోచించాడు.

Viral Video: అమ్మాయికి ప్రపోజ్ అయితే చేశాడు కానీ.. చివర్లో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..


చీటికీమాటికీ బకెట్ పెట్టి హీటర్ చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో గానీ.. ఏకంగా హీటర్‌ను (Heater in water tank) ఇంటిపైన వాటర్ ట్యాంక్‌లో పడేశాడు. ఆ తర్వాత ఎంచక్కా బాత్రూంలో కొళాయి ఆన్ చేసి, వేడి స్నానం చేసేశాడు. ఇలా హీటర్‌ను అందరిలా కాకుండా విచిత్రంగా వాటర్ ట్యాంక్‌లో వేసి, వేడి నీటి స్నానం చేసిన ఇతన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: అరే..! ఇది మాయా లేక మంత్రమా.. కరెంట్ బిల్లు తగ్గించేందుకు వింత ట్రిక్.. చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేం విచిత్రం.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘అన్ని నీళ్లు వేడి కావాలంటే కరెంట్ బిల్లు వాచిపోద్ది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2600కి పైగా లైక్‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఐఫోన్ దొంగను చితకబాదిన యువకులు.. మధ్యలో ఫోన్ స్ర్కీన్ చూడగా షాకింగ్ సీన్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 21 , 2025 | 11:58 AM