Viral Video: భార్య ముందు సింహం కూడా పిల్లిగా మారాల్సిందే.. వీడియో చూస్తే పడిపడి నవ్వుతారు..
ABN , Publish Date - Jan 21 , 2025 | 01:18 PM
ఓ ఆడ సింహం అడవి మధ్యలోని దారిలో పడుకుని ఉంటుంది. ఇంతలో ఓ మగ సింహం దాన్ని గమనిస్తుంది. మెల్లగా వెళ్లి ఆడ సింహాన్ని భయపెట్టాలని ప్రయత్నిస్తుంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని వద్దకు వెళ్తుంది. సమీపానికి వెళ్లగానే..

అడవి రాజైన సింహం.. పేరుకు తగ్గట్టుగానే మిగతా జంతువులను భయపెడుతూ రాజులాగే జీవిస్తుంటుంది. సింహం ఎదురుగా వచ్చిందంటే.. ఎలాంటి జంతువైనా భయంతో పారిపోవాల్సిందే. అయితే అంత పెద్ద సింహం కూడా కొన్నిసార్లు పిల్లిలా మారాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా ఆడ సింహాల విషయంలో మగ సింహాలు భయంతో పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆడసింహంతో సరసాలు ఆడాలని చూసిన మగ సింహం పరిస్థితి చివరక ఏమైందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఆడ సింహం అడవి మధ్యలోని దారిలో (sleeping lioness) పడుకుని ఉంటుంది. ఇంతలో ఓ మగ సింహం దాన్ని గమనిస్తుంది. మెల్లగా వెళ్లి ఆడ సింహాన్ని భయపెట్టాలని ప్రయత్నిస్తుంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని వద్దకు వెళ్తుంది. సమీపానికి వెళ్లగానే ఒక్కసారిగా దానిపై తల పెట్టి కొరికే ప్రయత్నం చేస్తుంది.
Viral Video: ఓర్నీ దుంపతెగా..! కోతుల పాలిట యముడిలా తయారయ్యాడుగా.. ఎలా భయపెడుతున్నాడో చూస్తే..
అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ఆడ సింహానికి.. మగ సింహం చేసిన నిర్వాకంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘ప్రశాంతంగా పడుకుని ఉంటే.. నీ గోలేంటీ మధ్యలో.. ఉండూ.. నీ సంగతి చెబుతా’’.. అంటూ దానిపై విరుచుకుపడుతుంది. ఆడ సింహం సీరియస్ రియాక్షన్‌తో (lioness scared the male lion) మంగసింహం బెంబేలెత్తిపోతుంది. ఇలా అంత పెద్ద మగ సింహాన్ని సైతం ఈ ఆడ సింహం అదరగొడుతుందన్నమాట.
Viral Video: చలికాలంలో ఇంత కంటే బెస్ట్ ట్రిక్ ఉండదేమో.. హీటర్‌తో ఇతను చేసిన పని చూస్తే..
ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భార్య ముందు మగ సింహం కూడా పిల్లిగా మారాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘ఆడ సింహమా.. మజాకా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 1.73 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: అమ్మాయికి ప్రపోజ్ అయితే చేశాడు కానీ.. చివర్లో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..