Share News

Woman: కూతురు గదిలోకి యువకుడిని పంపించిన తల్లి.. దీని వెనుక ఆమె ప్లానింగ్ తెలుసుకుని అంతా షాక్..

ABN , Publish Date - Jan 24 , 2025 | 12:15 PM

కొందరు తప్పని తెలిసినా తప్పులు చేస్తూ చివరకు జీవితాలను సర్వనాశనం చేసుకుంటుంటారు. మరికొందరు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు మరికొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువగా చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది..

Woman: కూతురు గదిలోకి యువకుడిని పంపించిన తల్లి.. దీని వెనుక ఆమె ప్లానింగ్ తెలుసుకుని అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

సవ్యంగా సాగే జీవితాల్లో కొన్నిసార్లు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు తప్పని తెలిసినా తప్పులు చేస్తూ చివరకు జీవితాలను సర్వనాశనం చేసుకుంటుంటారు. మరికొందరు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు మరికొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువగా చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఓ తల్లి తన కూతురు గదిలోకి ప్రియుడిని పంపించింది. ఈ దారుణం వెనుక వారి ప్లానింగ్ తెలుసుకుని స్థానికులతో పాటూ పోలీసులూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మహారాష్ట్రలోని (Maharashtra) థానే పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 38ఏళ్ల మహిళకు (woman) భర్త, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివాహమైనప్పటి నుంచి వీరి జీవితం ఎలాంటి సమస్యలూ లేకుండా ఎంతో సాఫీగా సాగుతోంది. అయితే ఇటీవల ఆమె జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు (extramarital affair) వివాహేతర సంబంధానికి దారి తీసింది.

Viral Video: షార్ట్‌కట్‌లో నరకానికి వెళ్లడమంటే ఇదే.. ఇతను చేస్తున్న పని చూస్తే నోరెళ్లబెడతారు..


భర్త, కూతురుకు తెలీకుండా ఆమె తన ప్రియుడితో సరసాలు సాగిస్తూ ఉండేది. సదరు యువకుడు ఎవరూ లేని సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 2023 నవంబర్‌ 9న అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ ప్రియుడితో అసభ్యకరంగా ఉన్న సమయంలో ఆమె కుమార్తె సడన్‌గా లోపలికి వచ్చింది. తల్లి పరాయి వ్యక్తితో అసభ్యకరంగా ఉండడం చూసి షాక్ అయింది. కూతురికి దొరికిపోవడంతో ఆమెతో పాటూ ప్రియుడు కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బాలికపై దాడి చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

Python Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..


అయితే అంతటితో ఆగని ఆమె తన కుమార్తెను కూడా పాడు చేయించాలని నిర్ణయించుంది. కూతురు ఏకాంతంగా ఉన్న సమయంలో తన ప్రియుడిని ఆమె గదిలోకి పంపించింది. లోపలికి వెళ్లిన ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే చంపేస్తామని వారు బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఊహించని విధంగా ఈ విషయం బాలిక తండ్రికి తెలిసింది. దీంతో అతను అతన కుమార్తెతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు.. తల్లి, ఆమె ప్రియుడిపై గురువారం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Love Propose Video: పట్టుబట్టి సాధించాడుగా.. లవ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన అమ్మాయిని.. ఎలా ఒప్పించాడంటే..


అయితే ఈ కేసులో ఇంత జాప్యం ఎందుకు జరిగిందనే విషయాలను పోలీసులు ప్రస్తావించలేదు. అలాగే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని, విచారణ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూతురు అనే ప్రేమ కూడా లేకుండా దారుణంగా ప్రవర్తించిన తల్లి, ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Monkey Funny Video: క్యారెట్ అనుకుని మిరపకాయ తినేసిన కోతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే..

Updated Date - Jan 24 , 2025 | 12:18 PM