Prank Video: రోడ్డుపై రూ.500 నోటును చూసి భయపడుతున్న జనం.. ఇంతకీ ఇతను ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Jan 23 , 2025 | 10:17 AM
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో వివిధ రకాల ప్రాంక్‌లు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై రూ.500 నోటును చూసి జనం భయంతో దూరంగా వెళ్లిపోతున్నారు. ఇంతకీీ ఇతను ఏం చేశాడో చూడంది..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ చాలా మంది మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. మరికొందరు ఇదే మూఢనమ్మకాలతో తమ జీవితాలను సైతం నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికీ రోడ్డుపై ఎక్కడైనా మిరపకాయలు, నిమ్మకాయలు కనిపిస్తే అదేదో అశుభం అన్నట్లు భయపడుతుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై రూ.500 నోటును చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై చేసిన ఫన్నీ ప్రాంక్ (Funny prank) వీడియో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. సదరు వ్యక్తి ముందుగా రోడ్డు మధ్యలో పసుపు, కుంకుమ పోశాడు. తర్వాత దానిపై రూ.500 నోటును పెట్టి, దానిపై నిమ్మకాయ కూడా పెట్టేశాడు. మొత్తం ఇలా సెట్ చేసి దూరంగా వెళ్లి కూర్చున్నాడు.
Tea on the train: రైల్లో టీ తాగుతుంటారా.. ఇక్కసారి ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే.. ఇకపై..
దారిన వెళ్లే వారంతా కరెన్సీ నోటును చూసి దగ్గరికి రావడం కాదు కదా.. చూసీ చూడగానే భయపడి దూరంగా జరుగుతున్నారు. కొందరు నోటును చూసి ఆశ్చర్యపోయినా.. ఆ వెంనటే పసుపు, కుంకుమ, నిమ్మకాయ చూసి భయంతో దగ్గరికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఇలా దారిన వెళ్లే వారంతా నోటు ఉన్న ప్రాంతాన్ని తొక్కకుండా దూరంగా వెళ్లిపోవడం కనిపించింది. ఇలా ఎంత సేపు ఎదురుచూసినా కూడా ఎవరూ ఆ నోటును తీసుకునే ధైర్యం చేయలేదు.
Monkey funny video: క్యారెట్ అనుకుని మిరపకాయ తినేసిన కోతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రజలపై మూఢనమ్మకాలు ఏమేరకు ప్రభావం చూపుతున్నాయో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ’’.. అంటూ కొందరు, ‘‘నేనైతే ఆ నోటును తీసుకుని, నిమ్మకాలతో జ్యూస్ చేసుకునేవాడిని’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Eagle video: పీత పవరేంటో ఎప్పుడైనా చూశారా.. దాడి చేయబోయిన డేగను..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..