Share News

Tea On The Train: రైల్లో టీ తాగుతుంటారా.. ఇక్కసారి ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే.. ఇకపై..

ABN , Publish Date - Jan 23 , 2025 | 09:21 AM

రైలు ప్రయాణాల్లో ఊహించని అనుభూతులే కూడా అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలూ చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు సడన్ షాక్‌లు కూడా తగులుతుంటాయి. సీట్ల కోసం యుద్ధాలు చేసుకోవడం, రైలు బోగీల్లో వినూత్న విన్యాసాలు చేయడం చూస్తుంటాం. అలాగే నాణ్యత లేని ఆహార పదార్థాలను సరఫరా చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

Tea On The Train: రైల్లో టీ తాగుతుంటారా.. ఇక్కసారి ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే.. ఇకపై..

రైలు ప్రయాణాల్లో ఊహించని అనుభూతులే కూడా అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలూ చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు సడన్ షాక్‌లు కూడా తగులుతుంటాయి. సీట్ల కోసం యుద్ధాలు చేసుకోవడం, రైలు బోగీల్లో వినూత్న విన్యాసాలు చేయడం చూస్తుంటాం. అలాగే నాణ్యత లేని ఆహార పదార్థాలను సరఫరా చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో టీ విక్రయించే వ్యక్తి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రైల్లో (man selling tea on the train) ఓ వ్యక్తి టీ విక్రయిస్తుంటాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. రైల్లో టీ విక్రయిస్తే ఎలాంటి సమస్యా లేదు గానీ ఇతను టీప కంటైనర్‌ను బాత్రూంలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా అక్కడి ట్యాప్ వాటర్‌తో దాన్ని శుభ్రం చేయడం స్టార్ట్ చేశాడు.

Viral Video: ఎంత మందికైనా చిటికెలో చపాతీలు.. ఈమె ట్రిక్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


పరిశుభ్రమైన ప్రాతంలో క్లీనింగ్ చేయాల్నింది పోయి.. ఇలా అపరిశుభ్ర ప్రదేశంలో శుభ్రం చేయడం (Man cleaning tea container in bathroom) ప్రయాణికులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రైల్లో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది కొత్తేం కాదు. గతంలో చాలా మంది ఇలాగే చేసి అందరి ఆగ్రహానికి గురయ్యారు. ఓ వ్యక్తి కూరగాయలు రైలు బోగీ నేలపై కట్ చేయడం చూశాం. అలాగే రైలు అపరిశుభ్రంగా ఉన్న క్యాంటిన్‌లో ఎలుకలు తిరగడం కూడా చూశాం. తాజాగా, టీ విక్రేత వీడియో తెగ వైరల్ అవుతోంది.

Eagle video: పీత పవరేంటో ఎప్పుడైనా చూశారా.. దాడి చేయబోయిన డేగను..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టీ కంటైనరల్ శుభ్రం చేయడానికి ఇది తప్ప వేరే స్థలం కనిపించలేదా బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వ్యాపారాలు చేసే వారు శుభ్రత పాటించడం చాలా ముఖ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 74.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Monkey funny video: క్యారెట్ అనుకుని మిరపకాయ తినేసిన కోతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 23 , 2025 | 10:22 AM