Love Propose Video: పట్టుబట్టి సాధించాడుగా.. లవ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన అమ్మాయిని.. ఎలా ఒప్పించాడంటే..
ABN , Publish Date - Jan 23 , 2025 | 01:58 PM
ఓ యువకుడు తాను ఇష్టపడ్డ యువతికి వినూత్నంగా లవ్ ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న యువతి ఎదురుగా వెళ్లి చేతికి పూలు అందించి, మోకాళ్లపై నిల్చుని తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. అయితే ఆమె పూలను పక్కన విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంది. దీంతో..

ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రేమను వ్యక్తం చేసే విధానం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. మరికొందరు లవ్ ప్రపోజ్ చేసే విధానం చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ప్రేయసికి పూలు అందించి లవ్ ప్రపోజ్ చేశాడు. ఆమె తిరస్కరిచండంతో చివరకు అతను ప్రవర్తించిన తీరు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘పట్టుబట్టి సాధించాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తాను ఇష్టపడ్డ యువతికి వినూత్నంగా లవ్ ప్రపోజ్ (Love proposal) చేయాలని అనుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న యువతి ఎదురుగా వెళ్లి చేతికి పూలు అందించి, మోకాళ్లపై నిల్చుని తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. అయితే ఆమె పూలను పక్కన విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంది. దీంతో అతడికి ఒక్కసారిగా బాధ పొంగుకొస్తుంది.
Funny Viral Video: పెళ్లిలో భోజనం చేస్తున్న వ్యక్తి.. వెనుక నుంచి వీళ్లు చేసిన పని చూస్తే..
వెంటనే చిన్న పిల్లాడిలా రోడ్డుపై పడిపోయి గిలగిలా కొట్టుకుంటాడు. పిల్లలు ఏడ్చినట్లుగా తాను కూడా మట్టిలో అటూ, ఇటూ దొర్లుతూ తనను లవ్ చేయాలంటూ ఏడుస్తూనే మరోవైపు కేకలు పెడతాడు. అతడి చేష్టలకు షాకైనా ఆమె.. మళ్లీ వెనక్కు వచ్చి, కిందపడ్డ పూలను మళ్లీ చేతిలోకి తీసుకుంటుంది. అతడిని పైకి లేపి దుమ్ము మొత్తం చేత్తో విదిలిస్తుంది. ఇప్పటికైనా నా ప్రేమను అంగీకరిస్తావా.. అంటూ ప్రశ్నిస్తాడు. ఇందుకు ఆమె సరే.. అని చెప్పడంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు.
Viral Video: ఇది కడుపా లేక కాంక్రీటా.. ఇటుకతో ఇతను ఏం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇలా విచిత్రంగా తన ప్రేమను వ్యక్తం చేసిన ఇతన్ని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో కావాలని ప్లాన్ చేసి మరీ తీసినట్లుగా అనిపిస్తున్నా కూడా తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పట్టుబట్టి సాధించడమంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాక్కూడా లవ్ ప్రపోజ్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 2.80 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Stunt Viral Video: కారు టైరును ఇలా మార్చడం ఎప్పుడైనా చూశారా.. ఇతడి టాలెంట్ చూశారంటే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..